సోలార్ విద్యుత్‌ను వినియోగించుకోవాలి
ఆత్మకూరు: సోలార్ విద్యుత్‌ను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రాన్ని మోడల్ సోలార్ విద్యుత్ గ్రామంగా ఎంపిక చేసి గురువారం‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి కలెక్టర్ స్నేహ శబరీష్‌తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆత్మకూరు గ్రామాన్ని పూర్తి స్థాయిలో సోలార్ విద్యుత్ వినియోగ గ్రామంగా రూపొందించుకుంటున్నామన్నారు. గ్రామస్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. లబ్ధిదారులు ఉచితంగా విద్యుత్ వినియోగించడంతోపాటు మిగిలిన విద్యుత్‌ను ప్రభుత్వానికే కొనుగోలు చేసి ఆదాయం పొందవచ్చన్నారు. ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. మోడల్ గ్రామంగా ఆత్మకూరును ఎంచుకోవడం సంతోషకరం అన్నారు. గ్రామ ప్రజలు సోలార్ విద్యుత్‌ను సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. గ్రామంలో సోలార్ విద్యుత్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రతీ ఇంటికి సోలార్ విద్యుత్ అందేలా అధికారులు పనిచేయాలన్నారు. లబ్ధిదారులకు సోలార్ విద్యుత్‌పై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి తహసీల్దార్ జగన్మోహన్‌రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్‌ఈ మధుసూదన్, రూరల్ డీఈ మల్లికార్జున్, డీఎం మహేందర్‌రెడ్డి, ఏడీఈ దేవేందర్‌నాయక్, ఏఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
మోడల్ గ్రామం ఆత్మకూరులో ప్రారంభం


