పట్టు పురుగుల పెంపకంపై అవగాహన
ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో పట్టు పురుగుల పెంపకంపై మహిళా రైతులకు జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సుజాత ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఆర్డీఏ, సెరికల్చర్ డిపార్ట్‌మెంట్ సమన్వయంతో ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, దేవరుప్పుల మండలాల రైతులకు పట్టుపురుగుల పెంపకంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఆర్డీఓ మేన శ్రీను హాజరై మాట్లాడారు. ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో పెంట్రోల్ బంకులు, సోలార్ యూనిట్లు, బస్సులు, తదితర ప్రాజెక్టులు మహిళలకు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా పట్టుపురుగుల పెంపకం ద్వారా అధికంగా లాభాలు వచ్చే అవకాశం ఉందన్నారు. రానున్న రోజుల్లో జిల్లాలో 200ల ఎకరాల్లో సాగు చేయడానికి కావల్సిన ప్రణాళిక సిద్ధం చేసుకుని మందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీపీఎంఐబీ దయాకర్, సెరికల్చర్ అధికారి వెంకన్న, సంజీవరెడ్డి, ఏపీఎం కవిత, సీసీలు హైమ, మమత తదితర మహిళా రైతులు పాల్గొన్నారు.


