భద్రకాళి అమ్మవారికి చీర బహూకరణ | - | Sakshi
Sakshi News home page

భద్రకాళి అమ్మవారికి చీర బహూకరణ

Feb 20 2026 6:25 AM | Updated on Feb 20 2026 6:25 AM

భద్రక

భద్రకాళి అమ్మవారికి చీర బహూకరణ

భద్రకాళి అమ్మవారికి చీర బహూకరణ బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి డీసీ నుంచి జేసీగా బాధ్యతల స్వీకరణ

హన్మకొండ కల్చరల్‌: వరంగల్‌ నగరంలోని శ్రీభద్రకాళి అమ్మవారికి గురువారం వేదుమ ఫ్యాబ్రిక్‌ హౌజ్‌ తయారుచేసిన కస్టమైజ్డ్‌ ఆర్ట్‌ డిజైన్‌ చీరను బహూకరించారు. చీరపై హ్యాండ్‌ ఆర్ట్‌తో అమ్మవారి ప్రతిరూపాన్ని అందంగా ప్రతిబింబించారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి సంస్థ యజమానులు ఓరుగంటి కార్తీక్‌, మోర రవళి అందజేసిన చీరను అమ్మవారికి అలంకరించారు.

వరంగల్‌ లీగల్‌: బాల్య వివాహాలను అంతం చేసేందుకు చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని వరంగల్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ పిలుపునిచ్చారు. గురువారం వరంగల్‌ జిల్లా కోర్ట్‌ హాల్‌ ఎదుట ‘షేర్‌’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘బాల్య వివాహ విముక్తి ప్రచార రథాన్ని’ ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సంస్థ రూపొందించిన అవగాహన కరపత్రాలను వరంగల్‌ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్‌, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ మాట్లాడుతూ.. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడంలో ‘షేర్‌’ ఎన్జీఓ చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం ప్రచార రథంపై ఏర్పాటు చేసిన సంతకా ల సేకరణలో భాగంగా సంతకం చేశారు. కార్యక్రమంలో షేర్‌ ఎన్జీఓ జిల్లా కో–ఆర్డినేటర్‌ శిరీష, కమ్యూనిటీ మొబిలైజర్స్‌ జ్ఞానేశ్వరి, జమున, చామంతి, జగన్‌, కల్పన, ప్రశాంతి, గాయత్రి, ప్రభాకర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

విద్యారణ్యపురి: జిల్లాలో ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్‌ విద్య ఇన్‌చార్జ్‌ ఆర్జేడీ, హనుమకొండ డీఐఈఓ గోపాల్‌ సీఎస్‌, డీఓలను ఆదేశించారు. గురువారం హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో హనుమకొండ జిల్లాలోని ఇంటర్‌ విద్యార్థులకు సంబంధించిన 52 పరీక్ష కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్లకు, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లకు, అదనపు చీఫ్‌ సూపరింటెండెంట్లతో పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణపై సూచనలిచ్చారు. విద్యార్థులు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని వరంగల్‌, హనుమకొండ డీఐఈఓలు గోపాల్‌, శ్రీధర్‌ సుమన్‌ తెలిపారు. సమావేశంలో హనుమకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆర్‌.శ్రీనివాస్‌రావు, హైపవర్‌ కమిటీ సభ్యులు శ్రీధర్‌, డిస్ట్రిక్ట్‌ ఎగ్జామినేషన్‌ మెంబర్లు కోటేశ్‌, సునీత, కవిత తదితరులు పాల్గొన్నారు.

కాజీపేట అర్బన్‌ : ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న జి.అంజన్‌రావు జాయింట్‌ కమిషనర్‌గా పదోన్నతి పొందారు. కాగా, గురువారం హైదరాబాద్‌లోని ఎకై ్సజ్‌శాఖ కమిషనరేట్‌లో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో జాయింట్‌ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు నూతన డీసీ నియమితులయ్యే వరకు ఇన్‌చార్జ్‌ డీసీగా అంజన్‌రావు కొనసాగనున్నారు.

భద్రకాళి అమ్మవారికి  చీర బహూకరణ1
1/2

భద్రకాళి అమ్మవారికి చీర బహూకరణ

భద్రకాళి అమ్మవారికి  చీర బహూకరణ2
2/2

భద్రకాళి అమ్మవారికి చీర బహూకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement