టెండర్ నిలిపివేయాలి
గుట్టపై మైనింగ్ చేయడానికి రెవెన్యూ అధికారులు జారీ చేసిన ఎన్‌ఓసీని వెంటనే రద్దు చేయాలి. మైనింగ్ ఽశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెండర్‌ను నిలిపివేయాలి. ఈ గుట్ట చుట్టూ రైతుల వ్యవసాయ భూములు, బావులు ఉన్నాయి. క్రషర్ ఏర్పాటుతో భూములు బీడుగా మారతాయి. బావులు కూలిపోతాయి. ముఖ్యంగా గ్రామంలోని పశువులు మేత లేక మృత్యువాత పడే ప్రమాదం ఉంది. గుట్ట ప్రాంతాన్ని గొర్రెల మేత కోసం కేటాయిస్తూ ప్రభుత్వం జీఓ సైతం జారీ చేసింది. ఇదే గుట్టపై వేంకటేశ్వరస్వామి దేవాలయం ధ్వంసమయ్యే ప్రమాదం ఉంది.
– కుసుమ సతీశ్, బోజెర్వు సర్పంచ్


