కల్చర్‌ఫుల్ ఫెస్ట్..
● నిట్‌లో ఉత్సాహంగా స్ప్రింగ్‌స్ప్రీ–26 వేడుకలు
● ఆకట్టుకున్న స్వయంభు సినిమా యూనిట్
● సందడి చేసిన హీరోయిన్లు సంయుక్త మీనన్, నభా నటేష్
● ప్రత్యేక ఆకర్షణగా హీరో నిఖిల్ సిద్ధార్థ, డైరెక్టర్ శైలేష్
● ఉర్రూతలూగించిన ప్రోషో
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్‌లో విద్యార్థులే నిర్వాహకులుగా నిర్వహిస్తున్న సాంస్కృతిక మహోత్సవం కల్చరల్‌ఫెస్ట్ కలర్‌పుల్‌గా సాగింది. ఈ ఫెస్ట్‌లో దేశవ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొని తమతమ సంస్కృతీసంప్రదాయాలను పంచుకున్నారు. తొలిరోజు శుక్రవారం స్ప్రింగ్‌స్ప్రీ–26లో డైరెక్టర్స్ కట్‌లో సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను, స్వయంభు మూవీ హీరో నిఖిల్ సిద్ధార్థ్, హీరోయిన్లు సంయుక్త మీనన్, నభా నటేష్, అభినవ్ గోమటమ్, కెమెరామెన్ కేకే సెంథిల్‌కుమార్, ప్రోషోలో జోనితాగాంధీ తన గానామృతంతో విద్యార్థులను అలరించారు. ఫ్లాష్ షూట్ సీఈఓ స్టార్టప్ రంగాలపై అవగాహన కల్పించారు. చివరి రోజు శనివారం ప్రోషోలో రానినారెడ్డి పాప్ సాంగ్స్‌తో అలరించనుంది.
‘వారేవా ఏమీ ఫేసు.. అచ్చం హీరోలా ఉంది బాసు’ అని పాట పాడుతూ విద్యార్థులు ఫేస్ పెయింటింగ్‌లో కలర్‌ఫుల్ లుక్ ఇచ్చారు. తమ ముఖాలలపై డైనోసార్, ప్రకృతిని తమ చేతి కుంచెతో వివిధ రంగులతో ఆవిష్కరించుకున్నారు.
కల్చర్‌ఫుల్ ఫెస్ట్..
కల్చర్‌ఫుల్ ఫెస్ట్..
కల్చర్‌ఫుల్ ఫెస్ట్..
కల్చర్‌ఫుల్ ఫెస్ట్..
కల్చర్‌ఫుల్ ఫెస్ట్..
కల్చర్‌ఫుల్ ఫెస్ట్..
కల్చర్‌ఫుల్ ఫెస్ట్..


