మార్కెట్‌లో సదుపాయాల కల్పనకు కృషి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
పరకాల: పరకాల వ్యవసాయ మార్కెట్‌లో రైతులకు మౌలిక సదుపాయాల కల్పనకు శాయశక్తులా కృషిచేస్తానని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. మార్కెట్‌లో పలు అభివృద్ధి పనులకు గురువారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఆర్‌ఓ వాటర్ ప్లాంట్, ఐదువేల మెట్రిక్ టన్నుల గోదాం చుట్టూ సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్‌ఓ వాటర్ ప్లాంట్ నిర్మాణంతో తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని, గోదాం చుట్టు సీసీ రోడ్డు నిర్మాణంలో హమాలీలకు ఇబ్బందులు ఉండవని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి, పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్‌కుమార్, శ్రీకుంకుమేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ కొలుగూరి రాజేశ్వర్‌రావు, మార్కెట్ అధికారులు, డైరెక్టర్లు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


