చాహత్‌ బాజ్‌పాయ్‌ వివరాలు.. | - | Sakshi
Sakshi News home page

చాహత్‌ బాజ్‌పాయ్‌ వివరాలు..

Feb 27 2026 7:50 AM | Updated on Feb 27 2026 7:50 AM

చాహత్

చాహత్‌ బాజ్‌పాయ్‌ వివరాలు..

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

మ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ఐఏఎస్‌ అధికారులకు స్థానచలనం కలిగింది. రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్‌ లను బదిలీ చేస్తూ చీఫ్‌ సెక్రట్రరీ కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.హనుమకొండ, మహబూబా బాద్‌, జనగామ కలెక్టర్లను బదిలీ చేసి.. వారి స్థానంలో కొత్త కలెక్టర్లను నియమించారు. ఏటూరునాగారం ఐటీడీఏ పీఓను కరీంనగర్‌ కలెక్టర్‌గా నియమించారు. జనగామ అదనపు కలెక్టర్‌ను హైదరాబాద్‌కు బదిలీ చేశారు. ఇటీవలే ఐఏఎస్‌ అధికారి హోదా కల్పించిన స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ను వరంగల్‌ అడిషనల్‌ కలెక్టర్‌ (లోకల్‌ బాడీస్‌)గా ప్రభుత్వం నియమించింది.

ఎవరు ఎక్కడికంటే..

గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ చాహత్‌ బాచ్‌పాయ్‌ హనుమకొండ కలెక్టర్‌గా నియమితులయ్యారు. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు కమిషనర్‌గా కూడా ఆమెకు బాధ్యతలు అప్పగించారు. హనుమకొండ కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ను మహబూబాబాద్‌కు బదిలీ చేశారు. మహబూబాబాద్‌ కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్‌ను ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ సమన్వయ శాఖకు బదిలీ చేశారు. జనగామ కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ జోగుళాంబ గద్వాలకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆరు నెలల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా పనిచేసి ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కుత్బుల్లాపూర్‌ జోనల్‌ కమిషనర్‌గా ఉన్న సందీప్‌ కుమార్‌ ఝాను నియమించారు. మరో ఐఏఎస్‌ అధికారి, జనగామ అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) పర్మార్‌ పింకేష్‌కుమార్‌ లలిత్‌కుమార్‌ను బదిలీ చేస్తూ జీహెచ్‌ఎంసీ కుత్బుల్లాపూర్‌ జోనల్‌ కమిషనర్‌గా నియమించారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరిని నియమించలేదు. కాగా, ఇటీవల ఐఏఎస్‌ (ఎస్‌సీఎస్‌) అధికారిగా పదోన్నతి పొందిన స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వైవీ గణేశ్‌కు వరంగల్‌ అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు)గా పోస్టింగ్‌ ఇచ్చారు.

ఐటీడీఏ పీఓ టు కరీంనగర్‌ కలెక్టర్‌..

ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా కరీంనగర్‌ కలెక్టర్‌గా నియమితులయ్యారు. 2019 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆమె 2024 ఫిబ్రవరి 12న ఏటూరునాగారం ఐటీడీఏ పీఓగా బాధ్యతలు చేపట్టారు. సుమారు రెండు సంవత్సరాలకు పైగా గిరిజన సంక్షేమం, గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో ఆమె కీలక పాత్ర పోషించారన్న పేరుంది. దీంతో ఆమెను ప్రభుత్వం కరీంనగర్‌ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఏటూరునాగారం ఐటీడీఏ పీఓగా ఇంకా ఎవరినీ నియమించలేదు.

పూర్తి పేరు: పి.స్నేహ శబరీష్‌

కేడర్‌, బ్యాచ్‌ : ఐఏఎస్‌, 2017 బ్యాచ్‌ (తెలంగాణ కేడర్‌) స్వస్థలం: కేరళ రాష్ట్రం

కుటుంబం: ఆమె భర్త డాక్టర్‌ శబరీష్‌, ఐపీఎస్‌ (2017 బ్యాచ్‌). ఆయన ప్రస్తుతం మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమార్తె ఉన్నారు.

విద్యార్హతలు: ప్రాథమిక, ఉన్నత విద్య కేరళలో పూర్తిచేశారు. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో (యూపీఎస్సీ 2016) జాతీయస్థాయిలో 47వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌ అధికారిగా ఎంపికయ్యారు. నిజామాబాద్‌ జిల్లాలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా శిక్షణ పొందారు. కామారెడ్డి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌గా పనిచేశారు. జీహెచ్‌ఎంసీలో జాయింట్‌ కమిషనర్‌గా, జోనల్‌ కమిషనర్‌గా సేవలందించారు. 2025 జూన్‌ 12న హనుమకొండ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అభివృద్ధి పనులు, ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. గురువారం జరిగిన బదిలీల్లో మహబూబాబాద్‌ కలెక్టర్‌గా నియమితులు కాగా.. ఒకే జిల్లాలో భార్యాభర్తలు కలెక్టర్‌, ఎస్పీగా పనిచేసే అరుదైన అవకాశం కలిగింది.

పూర్తి పేరు: చాహత్‌ బాజ్‌పాయ్‌

కేడర్‌, బ్యాచ్‌ : ఐఏఎస్‌, 2019 బ్యాచ్‌ (తెలంగాణ కేడర్‌) స్వస్థలం: ఢిల్లీ

సివిల్స్‌ ర్యాంకు: యూపీఎస్సీ, 2018 పరీక్షలో జాతీయ స్థాయిలో 59వ ర్యాంకు సాధించారు.

విద్యార్హతలు : ప్రాథమిక విద్య ఢిల్లీలో సాగింది. ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌లో విజయం సాధించడం ఆమె ప్రతిభకు నిదర్శనం. కాగా, తెలంగాణలో యువ ఐఏఎస్‌ అధికారిగా తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా శిక్షణ తీసుకున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌గా (స్థానిక సంస్థలు) పనిచేశారు. అక్కడ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కషి చేశారు. 2025 జూన్‌లో జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా నియమితులైన బాజ్‌పాయ్‌.. స్నేహ శబరీష్‌ బదిలీ తర్వాత ప్రభుత్వం ఆమెను హనుమకొండ కలెక్టర్‌గా గురువారం నియమించింది. చాహత్‌ బాజ్‌పాయ్‌ టీజీఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి సతీమణి.

సందీప్‌కుమార్‌ ఝా వివరాలు..

సందీప్‌ కుమార్‌ ఝా 2014 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. పంత్‌నగర్‌లోని జీబీ పంత్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ టెక్నాలజీ నుంచి అగ్రికల్చర్‌లో డిగ్రీ, ఆనంద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి పీజీ డిప్లొమా పొందారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా, టీఎస్‌ ట్రాన్స్‌కో జేఎండీగా సందీప్‌కుమార్‌ పనిచేశారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు ఉన్నత న్యాయస్థాన ఉత్తర్వులను పట్టించుకోలేదని, ప్రజాపాలన దినోత్సవానికి ఆలస్యంగా వెళ్లారన్న ఆరోపణలు ఉన్నాయి. విధుల పరంగా గ్రామాల్లో పర్యటిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కీలకంగా వ్యవహరించారన్న పేరున్నా.. 2025 అక్టోబర్‌లో ఆయనను హైదరాబాద్‌కు బదిలీ చేశారు. జీహెచ్‌ఎంసీ కుత్బుల్లాపూర్‌ జోనల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న సందీకుమార్‌ ఝాకు ప్రభుత్వం జనగామ కలెక్టర్‌ బాధ్యతలు అప్పగించింది.

ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి

ఏడుగురికి స్థానచలనం

హనుమకొండ కలెక్టర్‌గా చాహత్‌బాజ్‌పాయ్‌.. ‘గ్రేటర్‌’ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు

మహబూబాబాద్‌కు హనుమకొండ

కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

కేంద్ర సర్వీసులకు మహబూబాబాద్‌

కలెక్టర్‌ అద్వైత్‌సింగ్‌

జోగుళాంబ గద్వాలకు జనగామ కలెక్టర్‌

షేక్‌ రిజ్వాన్‌ బాషా

ఆయన స్థానంలో సందీప్‌ కుమార్‌ ఝా

నియామకం

ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా

కరీంనగర్‌ కలెక్టర్‌గా బదిలీ

గ్రేటర్‌ వరంగల్‌

ఇన్‌ ?

అవుట్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హనుమకొండ

ఇన్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

అవుట్‌ స్నేహ శబరీష్‌

జనగామ

ఇన్‌ సందీప్‌కుమార్‌ ఝా

అవుట్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా

మహబూబాబాద్‌

ఇన్‌ స్నేహ శబరీష్‌

అవుట్‌ అద్వైత్‌సింగ్‌

ఏటూరునాగారం ఐటీడీఏ

ఇన్‌ ?

అవుట్‌ చిత్రామిశ్రా

స్నేహ శబరీష్‌ వివరాలు..

చాహత్‌ బాజ్‌పాయ్‌ వివరాలు..1
1/6

చాహత్‌ బాజ్‌పాయ్‌ వివరాలు..

చాహత్‌ బాజ్‌పాయ్‌ వివరాలు..2
2/6

చాహత్‌ బాజ్‌పాయ్‌ వివరాలు..

చాహత్‌ బాజ్‌పాయ్‌ వివరాలు..3
3/6

చాహత్‌ బాజ్‌పాయ్‌ వివరాలు..

చాహత్‌ బాజ్‌పాయ్‌ వివరాలు..4
4/6

చాహత్‌ బాజ్‌పాయ్‌ వివరాలు..

చాహత్‌ బాజ్‌పాయ్‌ వివరాలు..5
5/6

చాహత్‌ బాజ్‌పాయ్‌ వివరాలు..

చాహత్‌ బాజ్‌పాయ్‌ వివరాలు..6
6/6

చాహత్‌ బాజ్‌పాయ్‌ వివరాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement