ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మొత్తం 52 కేంద్రాల్లో తొలిరోజు సెకండ్ లాంగ్వేజ్ పరీక్షలు నిర్వహించారు. జనరల్, ఒకేషనల్ కలిపి 18,768మందికి, 18,375 మంది (98శాతం) విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని డీఐఈఓ ఎ.గోపాల్ తెలిపారు.
వరంగల్ జిల్లాలో ముగ్గురు డీబార్..
కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలో ఇంటర్ సెకండియర్ తొలిరోజు సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు జనరల్ కోర్సుల్లో మొత్తం 4,821 మంది విద్యార్థులకు 4,705 మంది హాజరుకాగా, 116 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఒకేషన్ కోర్సుల్లో మొత్తం 744 మందికి 713 మంది విద్యార్థులు హాజరయ్యారని 31 మంది గైర్హాజరైనట్లు వివరించారు. జిల్లా స్థాయిలో ఇద్దరు డీఈసీ సభ్యులు, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, 4 సిట్టింగ్ స్క్వాడ్ సిబ్బంది విస్తృతంగా పర్యవేక్షించి ఆయా పరీక్ష కేంద్రాల్లో తనిఖీ చేసినట్లు చెప్పారు. పర్వతగిరి సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ద్వితీయ భాష తెలుగు సబ్జెక్టులో ముగ్గురు విద్యార్థులు డీబార్ అయినట్లు డీఐఈఓ తెలిపారు.
98 శాతం మంది విద్యార్థుల హాజరు
ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం
ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం


