నిట్‌లో వసంతోత్సవం సందడి
శుక్రవారం శ్రీ 27 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో విద్యార్థులే నిర్వాహకులుగా 1978లో ప్రారంభమైన స్ప్రింగ్ స్ప్రీ (వసంతోత్సవం) దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కల్చరల్ ఫెస్ట్‌గా పేరుగాంచింది. ఈనెల 27, 28 తేదీల్లో స్ప్రింగ్‌స్ప్రీ–26 వేడుకలను నిర్వహించేందుకు విద్యార్థులు ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల విద్యార్థులు సంస్కృతీ సంప్రదాయాలను పంచుకునే వేదికగా వసంతోత్సవం నిలువనుంది. రెండు రోజుల పాటు 40కుపైగా ఈవెంట్స్, డైరెక్టర్స్ కట్‌లో కై లాశ్ కొలను, స్వయంభూ మూవీ టీం ఇంటరాక్షన్, ప్రోషోలో జోనితా గాంధీ, రాణీనారెడ్డి మ్యూజిక్ ప్రదర్శనలు అలరించనున్నాయి. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని నిట్ క్యాంపస్‌ను గోల్డెన్ లైట్స్‌తో ప్రత్యేకంగా అలంకరించారు.
హలో ఎన్‌ఐటీ.. హవ్ ఆర్ యూ..
హలో ఎన్‌ఐటీ.. హవ్ ఆర్ యూ.. ఎంజాయ్ కల్చరల్‌ఫెస్ట్ స్ప్రింగ్ స్ప్రీ–26 అంటూ సినీహీరో, దర్శకుడు అడవి శేషు సందడి చేశారు. నిట్ ఆడిటోరియంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన స్ప్రింగ్ స్ప్రీ–26ని జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన మాట్లాడారు. డెకాయిట్ మూవీ షూటింగ్ యూరప్‌లో జరుగుతోంది. విద్యార్థుల ఆహ్వానం మేరకు యూరప్ నుంచి నిట్‌కు వచ్చానని తెలిపారు. డెకాయిట్ మూవీలోని రూబరు సాంగ్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ సాంగ్‌కు విద్యార్థులు ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. స్ప్రింగ్ స్ప్రీ–26 ప్రారంభోత్సవంలో సందడిగా గడిపారు. కార్యక్రమంలో స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ కిరణ్‌కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రారంభించిన సినీహీరో అడవి శేషు
రూబరు సాంగ్‌కు విద్యార్థుల స్టెప్పులు
నేడు, రేపు స్ప్రింగ్ స్ప్రీ–2026 వేడుకలు
నిట్‌లో వసంతోత్సవం సందడి


