ఐనవోలు మల్లికార్జునుడి హుండీ లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

ఐనవోలు మల్లికార్జునుడి హుండీ లెక్కింపు

Feb 20 2026 6:25 AM | Updated on Feb 20 2026 6:25 AM

ఐనవోలు మల్లికార్జునుడి హుండీ లెక్కింపు

ఐనవోలు మల్లికార్జునుడి హుండీ లెక్కింపు

సమకూరిన ఆదాయం రూ.1.49 కోట్లు

ఐనవోలు: ఐనవోలు మల్లిఖార్జున స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్‌ డివిజినల్‌ పరిశీలకులు డి.అనిల్‌ కుమార్‌ పర్యవేక్షణలో గురువారం నిర్వహించారు. 20 జనవరి 2026 నుంచి 19 ఫిబ్రవరి 2026 వరకు 30 రోజులకు హుండీల్లో రూ.38,73,858, వివిధ ఆర్జిత సేవా టికెట్ల ద్వారా రూ.1,10,54,223 రాగా, మొత్తం రూ.1,49,28,081 నగదు సమకూరినట్లు ఆలయ ఈఓ కందుల సుధాకర్‌ తెలిపారు. హుండీల్లో లభ్యమైన వెండి, బంగారాన్ని యథావిధిగా హుండీలోనే వేసి సీల్‌ చేసినట్లు తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో చైర్మన్‌ కమ్మగోని ప్రభాకర్‌గౌడ్‌, ధర్మకర్తలు, కానిస్టేబుళ్లు రమేశ్‌, యస్మిన్‌, అర్చక సిబ్బంది, ఒగ్గు పూజారులు, మహబూబాబాద్‌ శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సేవాసమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement