బైక్ స్టంట్స్.. ప్రోషో అదుర్స్
● రణీనారెడ్డి జోష్.. విద్యార్థుల కేరింతలు
● ముగిసిన నిట్ స్ప్రింగ్‌స్ప్రీ–26 వేడుకలు
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్‌లో నిర్వహిస్తున్న రెండు రోజుల సంస్కృతీసంప్రదాయాల వసంతోత్సవం స్ప్రింగ్‌స్ప్రీ–26 శనివారం ముగిసింది. వేడుకలకు దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు హాజరై రెండు రోజులపాటు ఉత్సాహంగా గడిపారు. రెండవ రోజు స్ప్రింగ్‌స్ప్రీ–26 వేడుకల ముగింపులో భాగంగా నిట్ మీడియా క్లబ్ ఆధ్వర్యంలో ‘డిటెక్టివ్ కనుక్కొ నీ మేధస్సు’ అంటూ పోటీ పడ్డారు, అచ్చం సినిమాలను తలపించేలా క్రైం సీన్ రీక్రియేషన్, బెస్ట్ ఆఫ్‌వేస్ట్ పర్యావరణ పరిరక్షణకు, ఐడల్ సింగింగ్ పోటీ, మాక్ పార్లమెంట్ తదితర ఉత్సాహ భరిత పోటీలతో కల్చరల్‌ఫెస్ట్ ముగిసింది.
అలరించిన బైక్ స్టంట్స్..
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌స్టంట్స్ టీం ప్రదర్శనలు అదరగొట్టాయి. ‘వీ ఆర్ రాయల్ వీ డు బైక్ స్టంట్స్ రాయల్లీ’ అంటూ విద్యార్థుల నడుమ స్టంట్స్‌తో దూసుకుపోయారు. బైక్ ముందు టైర్ గాల్లోకి లేపి చేసిన స్టంట్స్‌తోపాటు బ్యాక్ డ్రైవింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బైక్‌స్టంట్స్ వీక్షిస్తున్న విద్యార్థులు కేకలతో హోరెత్తించారు. రాత్రి ప్రోషోలో సింగర్ రణీనారెడ్డి తన గీతాలాపనతో విద్యార్థుల్లో జోష్ నింపింది.
బైక్ స్టంట్స్.. ప్రోషో అదుర్స్


