జాతరను ప్రశాంతంగా నిర్వహించాలి
గీసుకొండ: కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జరిగేలా కృషి చేయాలని, జాతర విజయవంతానికి రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని ఈస్ట్‌జోన్ డీసీసీ అంకిత్‌కుమార్ అన్నారు. హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్‌లోని తన కార్యాలయంలో గీసుకొండ, దుగ్గొండి, నర్సంపేట మండలాలకు చెందిన ప్రధాన పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, పలువురు అధికారులతో శనివారం జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్–నర్సంపేట రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని, ప్రభబండ్లతో వచ్చే వారు సంయమనం పాటించి గొడవలు జరగకుండా చూసుకోవాలన్నారు. గొడవలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గొడవలకు పాల్పడవద్దని నోటీసులు జారీ చేయగా.. తాము జాతర ప్రశాంతంగా జురగడానికి సహకరిస్తామని ఆయా పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు డీసీపీకి మాట ఇచ్చారు. మామునూరు, నర్సంపేట ఏసీపీలు వెంకటేశ్, రవీందర్‌రెడ్డి, గీసుకొండ, దుగ్గొండి, నర్సంపేట ఇన్‌స్పెక్టర్లు విశ్వేశ్వర్, సాయిరమణ, శ్రీనివాస్, గీసుకొండ తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, రాజ కీయ నాయకులు అల్లం బాలకిశోర్‌రెడ్డి వీరగోని రాజ్‌కుమార్, తుమ్మనపల్లి శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ పోలీసు ధర్మారావు, సర్పంచ్ బోడకుంట్ల ప్రకాశ్, కన్నెబోయిన ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
సమీక్షలో ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్


