ఉప్పెన వచ్చినా ఎదురొడ్డి నిలవాలి | - | Sakshi
Sakshi News home page

ఉప్పెన వచ్చినా ఎదురొడ్డి నిలవాలి

Mar 1 2026 7:23 AM | Updated on Mar 1 2026 7:23 AM

ఉప్పెన వచ్చినా ఎదురొడ్డి నిలవాలి

ఉప్పెన వచ్చినా ఎదురొడ్డి నిలవాలి

గీసుకొండ: ఎంచుకున్న లక్ష్యాలను సాధించే విషయంలో ఎదురుగా ఉప్పెన వచ్చినా ఎదురొడ్డి నిలవాలని, ఇన్నోవేటివ్‌గా ఆలోచించి ముందుకు సాగాలని కలెక్టర్‌ సత్యశారద విద్యార్థులకు పిలుపునిచ్చారు. మండలంలోని ధర్మారం జెడ్పీ ఉన్నత పాఠశాల, వంచనగిరి కేజీబీవీలో శనివారం నిర్వహించిన స్ఫూర్తి కార్యక్రమంలో కలెక్టర్‌ విద్యార్థులతో మాట్లాడారు. పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని పేర్కొన్నారు. మానసిక దృఢత్వాన్ని పెంపొందించేందుకు రూపొందించిన రెండు మోటివేషనల్‌ వీడియోలను విద్యార్థులకు చూపించి ఆత్మన్యూనతను వీడాలని సూచించారు. టెన్త్‌ విద్యార్థులు భయాందోళన వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయడానికి ఈ వీడియోలు ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. అంతకుముందు పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌, మధ్యాహ్న భోజనం, తరగతులు, పాఠశాలల పరిసరాలను కలెక్టర్‌ పరిశీలించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఎంఈఓ రవీందర్‌, కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్‌ హిమబిందు, హెచ్‌ఎం సాంబయ్య పాల్గొన్నారు.

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి..

న్యూశాయంపేట: గురుకుల పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెల్లో విద్యార్థులు చిట్టీల రూపంలో తెలియజేసిన సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. గురుకుల పాఠశాలల్లో ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేసి విద్యార్థుల సమస్యలు నేరుగా తెలుసుకునే పైలట్‌ ప్రాజెక్టును కలెక్టర్‌ అమలు చేస్తున్నారు. ఉపాధ్యాయులు బోధన సరిగా చేయడం లేదని, ప్రిన్సిపాళ్లతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఫిర్యాదు పెట్టెల్లో చిట్టీలు వేశారు. కలెక్టరేట్‌లో ఆర్‌సీఓల సమావేశంలో ఆమె మాట్లాడారు. డీబీసీడీఓ పుష్పలత, డీఎస్‌డీఓ భాగ్యలక్ష్మి, డీఎండబ్ల్యూఓ టి.రమేశ్‌, డీఈఓ రంగయ్యనాయుడు, డీడబ్ల్యూఓ రాజమణి, జీసీడీఓ ఫ్లోరెన్స్‌, టెమ్రిస్‌ ఆర్‌ఎల్‌సీ జంగా సతీశ్‌ ఉన్నారు.

కలెక్టర్‌ను కలిసిన ఆడిట్‌ టీం..

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెంట్రల్‌ ఆడిట్‌ టీం శనివారం కలెక్టర్‌ సత్యశారదను కలిసింది. సంగెం, పర్వతగిరి మండలాల్లో ఎంపికై న గ్రామాల్లో జరుగుతున్న, పూర్తిఅయిన ఉపాధిహామీ పథకం పనుల వివరాలను బృందం కలెక్టర్‌కు వివరించింది. కేంద్ర బృందంలో అమిత్‌ శ్రీవాత్సవ్‌, (టీంలీడర్‌) పరాష్‌శర్మ, మోహిత్‌కుమార్‌, మధుసూదన్‌, పీఆర్‌ కమిషనర్‌ కార్యాలయం నుంచి మురళి, రఘువీర్‌ ఉన్నారు. అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, డీఆర్‌డీఓ రాంరెడ్డి, ఏపీడీ శ్రీవాణి పాల్గొన్నారు.

విద్యార్థులకు కలెక్టర్‌ సత్యశారద పిలుపు

రెండు పాఠశాలల్లో స్ఫూర్తి కార్యక్రమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement