మాల సంఘాల జేఏసీ కన్వీనర్‌గా లక్ష్మీనారాయణ
కాళోజీ సెంటర్: మాల సంఘాల జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్‌గా పొనగంటి లక్ష్మీనారాయణను నియమిస్తూ రాష్ట్ర చైర్మన్ మందాల భాస్కర్, గౌరవ అధ్యక్షుడు చెరుకు రామచందర్, విద్యార్థి జేఏసీ చైర్మన్ మాదాసి రాహుల్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్‌లో శనివారం నిర్వహించిన మాల సంఘాల సమావేశంలో అడ్‌హక్ కమిటీని ఎన్నుకున్నారు. కోకన్వీనర్లుగా శేషాద్రి నాగులు, దండ్రి శ్రీనివాస్, పోతుల కొమ్మాలు, వంగేటి రాజ మౌళి, గురిమిల్ల రాజు, బుజుగుండ్ల శ్రీనివాస్, వంగేటి ప్రభాకర్ నియమితులయ్యారు.
బాల్య వివాహాలను ప్రోత్సహించడం నేరం
కాళోజీ సెంటర్: బాల్య వివాహాలను ప్రోత్సహించడం నేరమని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రాజ్‌నిధి అన్నారు. మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాలపై శనివారం నిర్వహించిన చైతన్య కార్యక్రమంలో జడ్జి మాట్లాడారు. బాల్య వివాహాలు ఉన్నత చదువులకు ఆటంకమని పేర్కొన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు భవిష్యత్ అంధకారం అవుతుందని పేర్కొన్నారు. హెచ్‌ఎం కె.అరుణ, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, భిక్షపతి, షౌకత్ అలీ, రమేష్, అజయ్‌బాబు, వంశీ మోహన్, ప్రభాకర్, పూర్ణిమ, సుభాషిణి, అరుణ, చంద్రకళ విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా పాఠశాలలో జరిగిన సైన్స్ దినోత్సవంలో జడ్జి పాల్గొని మాట్లాడారు.
ఇంటర్ పరీక్షకు 139 మంది గైర్హాజరు
కాళోజీ సెంటర్: జిల్లాలో శనివారం నిర్వహించిన ఇంటర్మీడియట్ సెకండియర్ ఇంగ్లిష్ పరీక్షకు 139 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్‌సుమన్ తెలిపారు. 4,716 మంది జనరల్ విద్యార్థులకు 4,608 మంది, 744 మంది ఒకేషనల్ విద్యార్థులకు 713 మంది హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.
ఆరె కులస్తులు రాజకీయంగా ఎదగాలి
దుగ్గొండి: చట్టసభల్లో ఆరె కులస్తులకు ప్రాతినిథ్యం ఉండాలని ఆరెకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీ అన్నారు. మండలంలోని గిర్నిబావిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆరె కుల సంఘం జిల్లా విస్తృతస్థాయి సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆరెకులస్తులు రాజకీయ, విద్య, వైద్య, ఆర్థిక రంగాల్లో ప్రగతి సాధించాలన్నారు. 22 జిల్లాల్లో కులస్తులు సర్పంచ్‌లుగా పోటీచేసి చాలా మంది గెలుపొందారని పేర్కొన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు ఇంగ్లీ శివాజీ, రాష్ట్ర కన్వీనర్ జెండా రాజేశ్వర్‌రావు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోర్తాల చందర్‌రావు, ఉద్యమ కమిటీ చైర్మన్ సోమిడి అంజన్‌రావు, నాయకులు కౌడగాని నర్సింహారావు, గుండెకారి రంగారావు, భుజంగరావు, సుకినె రాజేశ్వర్‌రావు, గుండెకారి రవికుమార్, ఒలిగె నర్సింగరావు, కుసుంభ బాబురావు, ఎడ్డె రఘుపతిరావు, సర్పంచ్‌లు నాగరాజు, ప్రభు, సుజాత పాల్గొన్నారు.
ఆరెకుల సంక్షేమ సంఘం
జిల్లా అధ్యక్షుడిగా నర్సింగరావు
ఆరె కుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా రేకంపల్లి గ్రామానికి చెందిన ఒలిగె నర్సింగరావు ఎన్నికయ్యారు. ఈమేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీ శనివారం నియామకపత్రం అందించారు. అదేవిధంగా జిల్లా గౌరవ అధ్యక్షుడిగా గుండెకారి రవీందర్‌రావును నియమించారు.
మాల సంఘాల జేఏసీ కన్వీనర్‌గా లక్ష్మీనారాయణ
మాల సంఘాల జేఏసీ కన్వీనర్‌గా లక్ష్మీనారాయణ


