నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కృషి
నెక్కొండ: నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కృషి చేస్తునట్లు జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ గౌతంరెడ్డి అన్నారు. నెక్కొండ విద్యుత్ సబ్‌స్టేషన్ ఆవరణలో నెక్కొండ, చెన్నారావుపేట మండలాలకు సంబంధించిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బందితో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. వినియోగదారుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును ఎప్పటికప్పుడు పరిష్కరించాలని గౌతంరెడ్డి ఆదేశించారు. నర్సంపేట డీఈ తిరుపతి, నెక్కొండ ఏడీఏ శ్రీధర్, ఏఈలు చిరంజీవి, సంపత్, సబ్ ఇంజనీర్ నరేశ్, సిబ్బంది పాల్గొన్నారు.


