ఉపాధ్యాయులకు మంచి రోజులు | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులకు మంచి రోజులు

Mar 1 2026 7:23 AM | Updated on Mar 1 2026 7:23 AM

ఉపాధ్యాయులకు మంచి రోజులు

ఉపాధ్యాయులకు మంచి రోజులు

ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్‌రెడ్డి

గీసుకొండ: ప్రభుత్వ ఉపాధ్యాయులకు మంచి రోజులు రానున్నాయని, పీఆర్‌సీ, పెండింగ్‌ బిల్లుల చెల్లింపు, హెల్త్‌కార్డుల జారీ, పదోన్నతులు, బదిలీలు తదితర సమస్యలు తీరనున్నాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. గంగదేవిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు అరుకాల స్వరూపారాణి శనివారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిఽథిగా పాల్గొని మాట్లాడారు. స్వరూపారాణి ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చారని, విద్యార్థులకు మంచి బోధనచేసి నడవడిక నేర్పారని పేర్కొన్నారు. అనంతరం స్వరూపారాణి దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానో పాధ్యాయుడు అబ్దుల్‌ రజాక్‌, ప్రముఖ సామాజిక సేవకుడు అల్లం బాలకిశోర్‌రెడ్డి, సర్పంచ్‌ కూసం స్వరూప, ఏఏపీసీ చైర్మన్‌ నాగిరెడ్డి లావణ్య, ఎంఈఓ రవీందర్‌, అల్లం బాలిరెడ్డి, పీఎస్‌ హెచ్‌ఎం జెసింత, పీఆర్‌టీయూ జల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవీందర్‌రెడ్డి, మహేందర్‌, నాయకులు ఎడ్ల ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement