రాష్ట్రస్థాయి స్పోర్ట్స్‌ మీట్‌లో విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి స్పోర్ట్స్‌ మీట్‌లో విద్యార్థుల ప్రతిభ

Feb 20 2026 6:25 AM | Updated on Feb 20 2026 6:25 AM

రాష్ట్రస్థాయి స్పోర్ట్స్‌ మీట్‌లో విద్యార్థుల ప్రతిభ

రాష్ట్రస్థాయి స్పోర్ట్స్‌ మీట్‌లో విద్యార్థుల ప్రతిభ

కాళోజీ సెంటర్‌ : హైదరాబాద్‌ దోమలగూడలో ఇటీవల నిర్వహించిన ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల రాష్ట్రస్థాయి స్పోర్ట్స్‌ మీట్‌లో వరంగల్‌ జిల్లా నుంచి 24 మంది వివిధ రకాల స్పోర్ట్స్‌లో పాల్గొన్నారు. గేమ్స్‌ మీట్‌లో వరంగల్‌ ఎల్‌బీ నగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (మాసూమ్‌ అలి), ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (మౌలాలి) ప్రాంగణంలోని భవిత కేంద్రంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొని ప్రతిభ చాటారు. వీరిలో మేడవాక వాగ్దేవి (డిస్కస్‌ త్రో), చంద్రగిరి రిషికేశ్‌(షాట్‌ పుట్‌) ఉన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల (మాసూమ్‌ అలి) ఇన్‌చార్జ్‌ ప్రధానోపాధ్యాయుడు కనకయ్య, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కమలాకర్‌ శ్రీధరాచార్యులు, కిషన్‌, దేవేందర్‌, భాస్కర్‌, మౌలాలి ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం జోసెఫ్‌, ఉపాధ్యాయులు నవ్య, లావణ్య, భవిత సెంటర్‌ ఉపాధ్యాయులు సువర్ణ, స్వాతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement