కొమ్మాల జాతర పోస్టర్ ఆవిష్కరణ
గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర పోస్టర్లు, కరపత్రాలను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి హనుమకొండలోని తన నివాసంలో గురువారం రాత్రి ఆవిష్కరించారు. ఈ నెల 23వ తేదీ నుంచి మార్చి 9 బ్రహ్మోత్సవాలు వరకు నిర్వహిస్తామని, ఈ నెల 27న స్వామివారి కల్యాణం జరుగుతుందని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు తెలిపారు. ఆలయ ఈఓ ప్రసాద్, అర్చకులు రామాచారి, విష్ణు, ఫణి, మాజీ ఎంపీపీ బీమగాని సౌజన్య, కాంగ్రెస్ పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ చాడ కొమురారెడ్డి, మండల అధ్యక్షుడు తుమ్మనపెల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ గోపాల్, నాయకులు కూసం రమేశ్, దూల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కాగా శుక్రవారం ఉదయం 10 గంటలకు జాతర నిర్వహణపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడటానికి ఆలయం వద్ద సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఈఓ వెల్లడించారు.


