మహిళా సంక్షేమానికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

మహిళా సంక్షేమానికి పెద్దపీట

Feb 27 2026 4:05 AM | Updated on Feb 27 2026 4:05 AM

మహిళా సంక్షేమానికి పెద్దపీట

మహిళా సంక్షేమానికి పెద్దపీట

ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి

గీసుకొండ : కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను మహిళలు వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. గ్రేటర్‌ వరంగల్‌ నగరం 16వ డివిజన్‌ జాన్‌పాకలో 15, 16, 17 డివిజన్లు, సంగెం మండలానికి చెందిన మొత్తం 50 మంది ముస్లిం మహిళలకు కలెక్టర్‌ సత్యశారదతో కలిసి గురువా రం ఆయన కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మైనార్టీ మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కుట్టుమిషన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని, కుట్టులో శిక్షణ పొందితే కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఆర్డీఓ సుమ, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి టి.రమేశ్‌, తహసీల్దార్‌ ఎండీ.రియాజుద్దీన్‌, కాంగ్రెస్‌ నాయకులు కొమురారెడ్డి, చిన్న, మాధవరెడ్డి, సంతోష్‌, ప్రవీణ్‌, సాల్మన్‌, మహ్మద్‌ జానీ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement