యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడి
వర్ధన్నపేట: మేలైన యాజమాన్య పద్ధతులతో ఆ యిల్ పామ్‌లో అధిక దిగుబడి సాధించవచ్చని జి ల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని ఇల్లందలో గురువారం తక్కళ్లపెల్లి సత్యనారాయణరావు ఆయిల్ పామ్ క్షేత్రంలో ఉద్యాన శాఖ ద్వారా ఆయిల్ పామ్ సాగులో రైతు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయిల్ పామ్‌లో నీటి, ఇరుల యాజమాన్యం, సస్యరక్షణ చర్యల ద్వారా అధిక ఆదాయం పొందడానికి ఆచరించాల్సిన పద్ధతలను శ్రీనివాసరావు వివరించారు. పశువుల ఎరువు, సహజ ఎరువులు వాడాలని సూచించారు. ఎకరానికి 10 టన్నుల దిగుబడి వస్తుందన్నారు. జిల్లాలో సాగవుతున్న పంట కొనుగోలు విధానం ఫ్యాక్టరీ నిర్మాణం తదితర విషయాలను రామ్‌చరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ అధినే త సతీష్‌నారాయణ వివరించారు. మండల ఉద్యా న అధికారి రాకేష్ రాయితీ వివరాలు యూరియా వాడకంపై వివరించారు. భవాని ప్రసాద్, సర్పంచ్ సాంబయ్య, జ్యోతి, కృష్ణారెడ్డి, కల్యాణ్ ఉన్నారు.


