ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం
● తొలిరోజు ముగ్గురు డీబార్
● గైర్హాజరైన 147 మంది విద్యార్థులు
కాళోజీ సెంటర్/పర్వతగిరి: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. పర్వతగిరి సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ద్వితీయ భాష తెలుగు సబ్జెక్టులో ముగ్గురు విద్యార్థులు డీబార్ అయినట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. జనరల్ కోర్సుల్లో మొత్తం 4,821 మంది విద్యార్థులకు గాను 4,705 మంది హాజరు కాగా 116 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ఒకేషన్ కోర్సుల్లో మొత్తం 744 మందికి గాను 713 మంది విద్యార్థులు హాజరయ్యారని 31 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో ఇద్దరు డీఈసీ సభ్యులు, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, 4 సిట్టింగ్ స్క్వాడ్ సిబ్బంది విస్తృతంగా పర్యవేక్షించి ఆయా పరీక్షా కేంద్రాల్లో పరీక్షలను సమీక్షించారని తెలిపారు.
ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం


