ప్రభుత్వ పాఠశాలల్లో బోధన తీరు మెరుగుపర్చాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లో బోధన తీరు మెరుగుపర్చాలి

Feb 27 2026 4:05 AM | Updated on Feb 27 2026 4:05 AM

ప్రభుత్వ పాఠశాలల్లో బోధన తీరు మెరుగుపర్చాలి

ప్రభుత్వ పాఠశాలల్లో బోధన తీరు మెరుగుపర్చాలి

ఖానాపురం: ప్రభుత్వ పాఠశాలల్లో బోధనతీరు మెరుగుపర్చాలని జిల్లా ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ బృందం నోడల్‌ ఆఫీసర్‌ శ్రీకాంత్‌ అన్నారు. మండలంలోని బుధరావుపేట ప్రాథమిక పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల బోధన తీరు, పాఠశాల పరిసరాలు, రికార్డులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను ఆదర్శంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన చేయాలన్నారు. బృందం సభ్యులు కుమారస్వామి, రఘు, హెచ్‌ఎం భద్రు, ఉపాధ్యాయులు రవీంద్రచారి, స్వర్ణలత, సంపూర్ణ, రాజ్‌కుమార్‌, సీఆర్పీ భాస్కర్‌ పాల్గొన్నారు.

కేజీబీవీ తనిఖీ

గీసుకొండ: వంచనగిరి కేజీబీవీని జిల్లా ప్యానల్‌ ఇన్‌స్పెక్షన్‌ టీం సభ్యులు గురువారం సందర్శించారు. టీం–2 నోడల్‌ అధికారి లింగారెడ్డి ఆధ్వర్యంలో ఉ పాధ్యాయినుల పనితీరు, రికార్డులు, రిజిస్టర్ల నిర్వహణ తీరును పరిశీలించారు. ఇంటర్‌, పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. విద్యాబోధన కార్యక్రమాలను తెలుసుకున్నారు. బృందం సభ్యులు రామా సంతోష్‌, ఆనందమోహన్‌రావు, శ్రీనివాసరావు, డాక్టర్‌ భాస్కర్‌, మంద రాజు , చక్రవర్తుల నాగార్జునరావు, సంపత్‌, కేజీబీవీ ఎస్‌ఓ హిమబిందు, టీచర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement