సెల్లార్.. బేజార్
పొంచి ఉన్న అగ్ని ప్రమాదాలు
షాపింగ్ కాంప్లెక్స్‌ల్లోని సెల్లార్లను కొందరు తమ వ్యాపారాలకు వినియోగించుకుంటున్నారు. మరికొందరు అద్దెకిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వరంగల్ స్టేషన్‌రోడ్డు, చౌరస్తా నుంచి పోచమ్మమైదాన్, జేపీఎన్ రోడ్డు, బట్టలబజార్ రోడ్డు, ఎంజీఎం రోడ్డు, అలంకార్ జంక్షన్ నుంచి పబ్లిక్ గార్డెన్, కాకాజీ కాలనీ, బస్‌స్టేషన్ రోడ్డు, విజయ టాకీస్ రోడ్డు, కరీంనగర్ రోడ్డు, అంబేడ్కర్ జంక్షన్ నుంచి వడ్డేపల్లి క్రాస్ రోడ్డు, బాలసముద్రం రోడ్డు, పెద్దమ్మగడ్డ నుంచి కేయూసీ మీదుగా కాజీపేట తదితర ప్రాంతాల్లో వేలాదిగా షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. కొన్ని కమర్షియల్ కాంప్లెక్స్‌ల్లో నిర్మించిన సెల్లార్లు దుర్వినియోగమవుతున్నాయి. కనీసం ఫైర్ నిబంధనలు పాటించడం లేదు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే జరిగే పరిణామాలను పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదు. సంఘటన జరిగితే నోటీసులు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఫైర్ సర్టిఫికెట్ రెన్యువల్‌ను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహారం అంతా బల్దియా టౌన్‌ప్లానింగ్, ఫైర్ అధికారులు, సిబ్బందికి తెలుసు. కానీ, కాసుల కోసం కుక్కర్తి పడి వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కలెక్టర్లు, పోలీస్ కమిషనర్, బల్దియా కమిషనర్ చొరవ చూపించి నగరంలో జఠిలంగా మారిన ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై సిటీప్లానర్ రవీందర్‌వాడేకర్‌ను ఫోన్‌లో సంప్రదించగా స్పందించలేదు.
వరంగల్ అర్బన్: కబ్జాకు కాదేది అనర్హం అన్నట్లు ఉంది నగరం పరిస్థితి. నాలాలు, చెరువులు, ఖాళీ స్థలాలే కాదు.. చివరకు ప్రధాన రహదారుల్లోని ఫుట్‌పాత్‌లు, సెల్లార్లను ఆక్రమిస్తున్నారు. ఫుట్‌పాత్‌లపై ర్యాంపులు నిర్మించి బడాబాబులు ఆక్రమించి తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లను అద్దెకిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. గత్యంతరం లేక రోడ్లపైనే ప్రజలు తమ వాహనాలను నిలుపుతున్నారు. మహా నగరంలో జనాభా తోపాటు వాహనాల రద్దీ పెరగడం, ఆయా ప్రాంతాల్లో పార్కింగ్ వ్యవస్థ లేకపోవడం సమస్యగా మారుతోంది. దీంతో వాహనాల రద్దీతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడి జనం అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్యే జఠిలం
వరంగల్ నగరంలో ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. ప్రధాన రహదారుల్లో రద్దీ ఎక్కువైంది. పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్‌లు, దుకాణాలకు వచ్చే వినియోగదారులు రోడ్లపై వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ కాంప్లెక్స్‌ల్లోకి వచ్చే వారు సె ల్లార్లలో వాహనాలను పార్కింగ్ చేయాలి. అయితే పార్కింగ్ కోసం వదిలిన సెల్లార్లు మూతపడ్డాయి. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లలో వెలిసిన దుకా ణాలు తొలగించాల్సిన నగరపాలక సంస్థ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వరంగల్, హనుమకొండ, కాజీ పేట ప్రాంతాల్లో మొత్తం 430 వరకు సెల్లార్లు ఉన్నా యి. ఇందులో సగానికి పైగా కాంప్లెక్స్‌ల్లోని పార్కింగ్ ప్రదేశాలు వాణిజ్య అవసరాలకే వినియోగిస్తున్నారు. 2009, 2013 సంవత్సరాల్లో అధికారులు అడపాదడపా కూల్చివేతలు చేసి వదిలేశారు. తిరిగి యఽథాస్థానాల్లో వెలిశాయి. దీంతో వినియోగదారులు తమ వాహనాలను రోడ్లపైనే నిలిపివేస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
సెట్‌బ్యాక్‌లు పట్టించుకోరు?
ప్రధాన రహదారుల్లో వాణిజ్య నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. వరంగల్, హనుమకొండ, కాజీపే ట ప్రాంతాల్లో సెట్ బ్యాక్ నిబంధలను 90 శాతాని కిపైగా ఉల్లంఘిస్తున్నారు. వాణిజ్య భవనాల కోసం ముందుకు బ్లూ ప్రింట్‌లో సెల్లార్లను చూపిస్తూ అనుమతి పొంది ఆతర్వాత ఇష్టారాజ్యంగా నిర్మిస్తున్నారు. జీ ప్లస్ 2 వరకు సెల్లార్ నిర్మించకపోయినా 2 మీటర్ల వరకు సెట్‌బ్యాక్ ఉండాలి. అడుగు స్థలం వదలకుండా రోడ్డు పైకి నిర్మాణాలు చేపడుతున్నారు. సెట్ బ్యాక్ నిబంధనలు పట్టించుకోవడం లేదు. రెండంతస్తుల నుంచి నాలుగైదు అనధికారిక అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి.
నగరంలోని షాపింగ్ కాంప్లెక్స్‌ల్లో
పెద్ద ఎత్తున ఉల్లంఘనలు
వ్యాపార కేంద్రాలుగా బహుళ అంతస్తుల పార్కింగ్ స్థలాలు
రహదారులపై వాహనాల నిలిపివేత
పట్టించుకోని అధికారులు, పోలీసులు


