సర్పంచ్‌లు పాలనపై అవగాహన పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌లు పాలనపై అవగాహన పెంచుకోవాలి

Feb 21 2026 8:11 AM | Updated on Feb 21 2026 8:11 AM

సర్పంచ్‌లు పాలనపై అవగాహన పెంచుకోవాలి

సర్పంచ్‌లు పాలనపై అవగాహన పెంచుకోవాలి

చట్టాలకు లోబడి నిర్ణయాలు తీసుకోవాలి

అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి

గీసుకొండ: సర్పంచ్‌లు గ్రామపంచాయతీల పాలనపై అవగాహన కలిగి ఉండాలని, పంచాయతీరాజ్‌ చట్టం –2018కు లోబడి నిర్ణయాలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి సూచించారు. మండలంలోని గంగదేవిపల్లిలో దుగ్గొండి, రాయపర్తి, ఖానాపూర్‌, నర్సంపేట మండలాల సర్పంచ్‌లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆమె శుక్రవారం పాల్గొని మాట్లాడారు. సర్పంచ్‌లు తమ గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందన్నారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, డీఎల్పీఓ రాజీవ్‌కుమార్‌, ఎంపీడీఓ అరుంధతి, ఎంపీఓలు పాక శ్రీనివాస్‌, కూచన ప్రకాశ్‌, సునీల్‌కుమార్‌ రాజు, జిల్లా ట్రైనింగ్‌ మేనేజర్‌ కూసం రాజమౌళి, స్వచ్ఛభారత్‌ కన్సల్టెంట్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఆరెపల్లి గ్రామాన్ని సందర్శించిన అధికారులు

ఆరెపల్లి గ్రామం రాష్ట్రస్థాయిలో చైల్డ్‌ ఫ్రెండ్లీ గ్రామంగా ఎంపికై జాతీయ అవార్డు కోసం కేంద్రానికి నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. త్వరలో కేంద్ర బృందం ఈ గ్రామాన్ని సందర్శించనుంది. ఈ మేరకు గ్రామాన్ని ఆరెపల్లిని జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన శుక్రవారం సందర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement