బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించాలి
వరంగల్ లీగల్: జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనపై తల్లిదండ్రులు, ప్రజలు, పిల్లలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని హనుమకొండ జిల్లా ఇన్‌చార్జ్ ప్రధాన న్యాయమూర్తి బి.అపర్ణదేవి పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కోర్టు ప్రాంగణంలో జస్ట్ రైట్ ఫర్ చిల్డ్రన్ షేర్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన బాల్య వివాహ విముక్తి ప్రచార రథాన్ని జెండా ఊపి పార్రంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి అపర్ణదేవి మాట్లాడుతూ చిన్నారులకు సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, సురక్షితమైన భవిష్యత్‌ను అందించడం మనందరి బాధ్యతని, బాల్య వివాహాలు చేసిన వారికి, సహకరించిన ప్రతి ఒక్కరికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. హనుమకొండ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, ఇన్‌చార్జ్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.రామలింగం, షేర్ ఎన్జీఓ జిల్లా కోఆర్డినేటర్ శిరీష, కమ్యూనిటీ మొబిలైజర్స్ జ్ఞానేశ్వరి, జమున చామంతి, జగన్, కల్పన, ప్రశాంతి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
హనుమకొండ జిల్లా ఇన్‌చార్జ్ న్యాయమూర్తి అపర్ణదేవి


