వ్యవసాయాధికారి శ్రీప్రియకు ఉత్తమ అవార్డు | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయాధికారి శ్రీప్రియకు ఉత్తమ అవార్డు

Feb 23 2026 9:41 AM | Updated on Feb 23 2026 9:41 AM

వ్యవసాయాధికారి శ్రీప్రియకు ఉత్తమ అవార్డు

వ్యవసాయాధికారి శ్రీప్రియకు ఉత్తమ అవార్డు

హన్మకొండ: హనుమకొండ సుబేదారిలోని వరంగల్‌ ఎరువులు నియంత్రణ ప్రయోగశాల వ్యవసాయాధికారి కొత్త శ్రీప్రియ ఉత్తమ ప్లాంట్‌ పాథోలజిస్ట్‌ జాతీయ పురస్కారం అందుకున్నారు. ఈ నెల 21న చండీఘడ్‌లో గ్లోబల్‌ అగ్రిమీట్‌ సదస్సు నిర్వహించారు. ఈసదస్సులో గతంలో సేంద్రియ ఎరువుల వాడకంపై సమర్పించిన పరిశోధన గ్రంథంపై వివరించారు. సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన కల్పించడంతో పాటు అధిక పంట దిగుబడులు పొందడానికి అవలంబించాల్సిన యాజమాన్య పద్ధతులు వివరించినందుకు ఈ అవార్డు వచ్చినట్లు ఆమె పేర్కన్నారు. జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ, జాతీయ డైరీ పరిశోధన సంస్థ, పంజాబ్‌లోని గురు కాశీ విశ్వ విద్యాలయం, రష్యాకు చెందిన సదరన్‌ సంస్థలు సంయుక్తంగా ఈ అగ్రి మీట్‌ను నిర్వహించాయి. అగ్రి మీట్‌ ఫౌండర్‌ అంకుర్‌ శర్మ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement