భద్రకాళికి సంగీత దర్శకుడు తమన్ పూజలు
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని ఆదివారం సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ ఽతమన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ, వరంగల్ జోన్ డీసీ రామల సునీత, ప్రధానార్చకుడు శేషు ఆయనను ఘనంగా స్వాగతించారు. తమన్ అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ధర్మకర్తలు తోనుపునూరి వీరన్న, ఓరుగంటి పూర్ణచందర్, మోత్కురి మయూరి, అనంతుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, జబర్దస్త్ ఫేం రాకేష్ కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు.


