నేటి దీక్షలు విజయవంతం చేయాలి
● ఎస్జీపీఏటీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి
విద్యారణ్యపురి: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఈ నెల 23న హనుమకొండలోని ఏకశిల పార్కు వద్ద చేపట్టనున్న నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని అసోసియేషన్ ఎస్‌జీపీఏటీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల శాఖలు సంయుక్తంగా ఆదివారం హనుమకొండలో పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో మార్చి 2024నుంచి జనవరి 2026 వరకు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈనెల 23న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ నిరాహరదీక్షలు కొనసాగుతాయన్నారు. సమావేశంలో అసోసియేపన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జి.వీరస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సమ్మారెడ్డి, జిల్లా కమిటీ బాధ్యులు సింగారెడ్డి రత్నాకర్, హనుమకొండ జనరల్ సెక్రటరీ కందుకూరి దేవదాసు, బాధ్యులు గొవిందరెడ్డి, సక్మారెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, జలందర్ తదితరులు పాల్గొన్నారు.


