ఎథినిక్ నైట్ జోష్..
నిట్ వరంగల్‌లో కల్చరల్ ఫెస్ట్ స్ప్రింగ్‌స్ప్రీ–26 బ్యానర్‌ను ఎథినిక్ నైట్ పేరిట మంగళవారం రాత్రి ఆకాశంలో ఆవిష్కరించారు. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ కిరణ్‌కుమార్‌లు ముఖ్య అతిథులుగా హాజరై డ్రోన్‌సాయంతో ఆకాశంలో బ్యానర్‌ను ఆవిష్కరించారు.ఈ నెల 27, 28 తేదీల్లో సంస్కృతీసంప్రదాయాలను తెలిపే వేదికగా స్ప్రింగ్‌స్ప్రీ–26 నిలవనుందని డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. వసంతోత్సవానికి స్వాగతం పలుకుతూ విద్యార్థినులు చీరకట్టు, విద్యార్థులు పంచకట్టులో అదరగొట్టారు.
– కాజీపేట అర్బన్


