పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు | - | Sakshi
Sakshi News home page

పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు

Feb 25 2026 7:01 AM | Updated on Feb 25 2026 7:01 AM

పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు

పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు

పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌

వరంగల్‌ క్రైం: ఇంటర్మీడియట్‌ పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్‌ 163 (144 )సెక్షన్‌ అమలులో ఉంటుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని మొత్తం 94 పరీక్ష కేంద్రాల్లో (హనుమకొండ 52, వరంగల్‌ 24, జనగామ 16) ఈనెల 24 నుంచి మార్చి 18 వరకు ఇంటర్‌ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని సీపీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement