నిట్‌లో ఉత్సాహంగా స్ప్రింగ్‌స్ప్రీ–26 వేడుకలు | - | Sakshi
Sakshi News home page

నిట్‌లో ఉత్సాహంగా స్ప్రింగ్‌స్ప్రీ–26 వేడుకలు

Feb 28 2026 7:03 AM | Updated on Feb 28 2026 7:03 AM

నిట్‌

నిట్‌లో ఉత్సాహంగా స్ప్రింగ్‌స్ప్రీ–26 వేడుకలు

నిట్‌లో ఉత్సాహంగా స్ప్రింగ్‌స్ప్రీ–26 వేడుకలు వారెవ్వ ఏమి ఫేసు.. ఫేస్‌ పెయింటింగ్‌.. ఫస్టియర్‌ పరీక్షకు 98 శాతం హాజరు నేడు డయల్‌ యువర్‌ డీఎం వచ్చే నెల 25న పోస్టల్‌ డాక్‌ అదాలత్‌ బకాయిలు ఒకేసారి చెల్లించాలి.. రంగు పడుతుంది.. హ్యాండ్‌ పెయింటింగ్‌.. ‘గ్రేటర్‌’కు వంద ఎలక్ట్రిక్‌ బస్సులు

న్యూస్‌రీల్‌

శనివారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

వేడుకకు హాజరైన

సినీ హీరోయిన్లు

నభా నటేష్‌,

సంయుక్త మీనన్‌

ఆకట్టుకున్న ‘స్వయంభు’ సినిమా యూనిట్‌

సందడి చేసిన హీరోయిన్లు సంయుక్త మీనన్‌, నభా నటేష్‌

ప్రత్యేక ఆకర్షణగా హీరో నిఖిల్‌ సిద్ధార్థ, డైరెక్టర్‌ శైలేష్‌

ఉర్రూతలూగించిన ప్రోషో

‘వారెవ్వ ఏమి ఫేసు.. అచ్చం హీరోలా ఉంది బాసు’ అని పాట పాడుతూ విద్యార్థులు ఫేస్‌ పేయింటింగ్‌లో కలర్‌ఫుల్‌ లుక్‌ ఇచ్చారు. తమ ముఖాలపై డైనోసార్‌, కమెడియన్‌, హలోవేషన్‌, బటర్‌ఫ్లై, డేంజరస్‌ మ్యాన్‌, ప్రకృతిని తమ చేతి కుంచెతో వివిధ రంగులతో ఆవిష్కరించుకున్నారు.

కాజీపేట అర్బన్‌ : నిట్‌ వరంగల్‌లో విద్యార్థులు నిర్వహిస్తున్న సాంస్కృతిక మహోత్సవం (కల్చరల్‌ ఫెస్ట్‌) కలర్‌ఫుల్‌గా సాగింది. ఈ ఫెస్ట్‌లో దేశవ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొని తమతమ సంస్కృతీ సంప్రదాయాలను పంచుకున్నారు. తొలిరోజు శుక్రవారం స్ప్రింగ్‌స్ప్రీ–26లో డైరెక్టర్స్‌ కట్‌లో సినిమా డైరెక్టర్‌ శైలేష్‌ కొలను, స్వయంభు మూవీ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌, హీరోయిన్లు సంయుక్త మీనన్‌, నభా నటేష్‌, అభినవ్‌ గోమటమ్‌, కెమెరామెన్‌ కేకే సెంథిల్‌కుమార్‌, ప్రోషోలో జోనితాగాంధీ తన గానామృతంతో విద్యార్థులను అలరించారు. ఫ్లాష్‌ షూట్‌ సీఈఓ స్టార్టప్‌ రంగాలపై అవగాహన కల్పించారు. చివరి రోజు శనివారం ప్రో షోలో రానినారెడ్డి పాప్‌ సాంగ్స్‌తో అలరించనుంది.

తొలిరోజు ఇలా...

స్ప్రింగ్‌స్ప్రీ–26 తొలిరోజు శుక్రవారం లిటరరీ అండ్‌ డిబేటింగ్‌ క్లబ్‌ సౌజన్యంతో ఓపెన్‌ మైక్‌, కవిత్వం, కథనాలు, వ్యంగ్య ప్రదర్శనలు, మిస్టరీ ఆధారిత గేమ్‌ ఆన్‌సాల్వ్‌డ్‌, సమాజాన్ని మేల్కోలిపే నుక్కడ్‌ నాటక్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తక్కువ సమయంలో కథను రూపొందించి ప్రదర్శించే డైరెక్టర్‌ స్కిట్‌, నువ్వా నేనా? అనేలా పోటీపడిన ట్రెజర్‌ హంట్‌ గేమ్‌, వారెవ్వ ఏమి ఫేసు అంటూ ఫేస్‌ పెయింటింగ్‌, నా చేతుల్లో హరివిల్లు అంటూ హ్యాండ్‌ పెయింటింగ్‌లతో వసంతోత్సవం అలరించింది.

విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ఇంటర్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం 52 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో 18,803 మంది హాజరు కావాల్సి ఉండగా.. 18,397 మంది హాజరైనట్లు డీఐఈఓ ఎ.గోపాల్‌ తెలిపారు.

తనిఖీ చేసిన కలెక్టర్‌..

హనుమకొండలోని కో–ఎడ్యుకేషన్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ తనిఖీ చేశారు. ఈవార్షిక పరీక్షల్లో ఎంత మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని డీఐఈఓ గోపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రంలో కల్పించిన సదుపాయాలు ఎలా ఉన్నాయో పరిశీలించారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షల ప్రశ్నపత్రాలను తెరిచే గదిని సందర్శించి పరిశీలించారు. ఈసందర్భంగా చీఫ్‌ సూపరింటెండెంట్‌కు, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌కు పలు సూచనలిచ్చారు. పరీక్ష కేంద్రం వద్ద ఉన్న ఆరోగ్య సిబ్బందితో మాట్లాడారు. ఆర్డీఓ రాథోడ్‌ రమేశ్‌ తదితరులున్నారు.

హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు సలహాలు, సూచనలు స్వీకరించేందుకు డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్‌ ధరంసింగ్‌ తెలిపారు. ఈ నెల 28న ఆర్టీసీ హనుమకొండ డిపో నుంచి ఉదయం 11 నుంచి 12 గంటల వరకు డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జమ్మికుంట, వేలేరు, ఐనవోలు, పర్వతగిరి, సంగెం, ఖిలా వరంగల్‌, హనుమకొండ, హసన్‌పర్తి, కమలాపూర్‌, వరంగల్‌, హనుమకొండ, కాజీపేట, ఖిలా వరంగల్‌ మండల పరిధి ప్రయాణికులు 89777 81103 నంబర్‌కు ఫోన్‌ చేసి సమస్యలు తెలపాలని, సలహాలు, సూచనలు అందించాలని కోరారు.

ఖిలా వరంగల్‌: మార్చి 25న పోస్టల్‌ సర్వీసులపై, వినియోగదారుల ఫిర్యాదులపై 53వ ప్రాంతీయ స్థాయి డాక్‌ అదాలత్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించనున్నట్లు వరంగల్‌ తపాలా శాఖ డివిజనల్‌ సూపరింటెండెంట్‌ రవికుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్‌, హనుమకొండ, మహబూబాబాద్‌, జనగామ జిల్లాల పరిధి డివిజన్‌కు సంబంధించి తపాలా సేవల వినియోగదారులకు ఏవైనా ఫిర్యాదులుంటే పోస్టల్‌ ఎన్వలప్‌/కవర్‌పై 53 డాక్‌ అదాలత్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (స్టాఫ్‌ అండ్‌ విజిలెన్స్‌) పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌, హైదరాబాద్‌ రీజియన్‌ హైదరాబాద్‌–500001కి మార్చి 9లోగా చేరేలా పంపించాలని కోరారు.

విద్యారణ్యపురి: రిటైర్డ్‌ ఉద్యోగ, ఉపాధ్యాయుల బకాయిలు ఏకమొత్తంలో చెల్లించాలని రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ బకాయిల సాధన సమితి ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ల ధర్మేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం హనుమకొండలోని పీఆర్టీయూ భవన్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి ఆ సంఘం సమావేశంలో మాట్లాడారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు బకాయిల చెల్లింపుల్లో కేవలం 10 నుంచి 20 శాతం వరకే ఇస్తున్నారని, ఇలా చెల్లిస్తే మరో 3, 4 ఏళ్లు పడుతుందన్నారు. ఇప్పటివరకు ఎంతో మంది రిటైర్డ్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బెనిఫిట్స్‌ రాక ఇబ్బందులు పడతున్నామన్నారు. ఈసభలో ఆ సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్‌, జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడు ఎండీ అలీ, బాధ్యులు అబ్దుల్‌ గఫార్‌, మేకిరి దామోదర్‌, ఇంద్రసేనారెడ్డి, రఘవీర్‌, విశ్వనాథం, సారయ్య, శ్యామ్‌, సమ్మయ్య ఉన్నారు.

మరిన్ని

ఫొటోలు:

8లో

‘నాతో పెట్టుకుంటే రంగు పడుతుంది’ అంటూ విద్యార్థులు స్ప్రింగ్‌స్ప్రీ–26 వేడుకల్లో ఉత్సాహంగా హ్యాండ్‌ పెయింటింగ్‌లో పాల్గొన్నారు. ప్లేట్‌లో రంగును

ఏర్పాటు చేసుకుని, దాన్ని అరచేతిలోకి తీసుకుని

నా హ్యాండ్‌ చూడూ అంటూ వాల్‌పోస్టర్లను

రూపొందించారు.

కాలేజ్‌ డేస్‌.. హ్యాపీ మూమెంట్స్‌

‘వావ్‌ నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌ సూపర్‌గా ఉంది. కాలేజీ డేస్‌.. హ్యాపీ డేస్‌. విద్యార్థి జీవితం మరిచిపోలేని అనుభూతి’ అని సినీహీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్న ఆయన పలు విషయాలపై మాట్లాడారు. భారతీయ సినిమాకు గ్లోబల్‌స్థాయి గుర్తింపు రావడం మనకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. స్వయంభు సినిమాతో మీ ముందుకు రావడం ఆనందంగా ఉందని, నేను చేస్తున్న ప్రతి సినిమాను డిఫరెంట్‌గా అందజేయాలని ఇలా స్వయంభుతో మీ ముందుకు వస్తున్నా అని తెలిపారు.

థ్రిల్లర్‌ సినిమాలకు ప్రత్యేక ఆదరణ

సినిమాలు ఎన్ని వచ్చినా కూడా సైలెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుందని డైరెక్టర్స్‌ కట్‌లో డైరెక్టర్‌ శైలేష్‌ కొలను తెలిపారు. ‘నాకు హిట్‌ ప్రాంఛైజ్‌, ఇన్విస్టిగేటివ్‌ థ్రిల్లర్లతోనే గుర్తింపు లభించింది. ఎవరికి వారు తమ అభిరుచులకు అనుగుణంగా జీవన ప్రయాణం సాగించాలి. సస్పెన్స్‌ థ్రిల్లర్‌లోనూ క్రియేటివిటీ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా అభిమానిస్తారు.. ఆదరిస్తారు’ అని డైరెక్టర్‌ శైలేష్‌ కొలను చెబుతున్నారు.

నేను చేసే కుండ చూడు..

పాట్‌ మేకింగ్‌..

‘నేను తయారు చేసే కుండ చూడు.. దిసిస్‌ మై పాట్‌ మేకింగ్‌’ అని కుమ్మరులు చేసే మట్టిని సారైపె లయబద్ధంగా తిప్పుతూ వివిధ రూపాల్లో పాత్రలను విద్యార్థులు తయారు చేశారు. వేసవిలో తాగునీటిని చల్లగా ఉంచేందుకు పల్లెల్లో ఇప్పటికీ ఇవే ప్రధానం అంటూ మట్టికుండలను రూపొందించారు.

రోజులో 30

నిమిషాలకు మించి

అంతరాయం కలిగితే అధికారిదే బాధ్యత

హన్మకొండ: విద్యుత్‌ అంతరాయాలపై టీజీ ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం సీరియస్‌గా దృష్టి సారించింది. వేసవిలో కోతలు లేని విద్యుత్‌ అందించడమే లక్ష్యంగా.. యాజమాన్యం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. బ్రేక్‌డౌన్‌లు, అంతరాయాలు లేని విద్యుత్‌ సరఫరా లేకుండా చూసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగుతోంది. ప్రధానంగా 33 కేవీ, 11 కేవీ విద్యుత్‌ లైన్‌లో పరిమితికి మించి విద్యుత్‌ అంతరాయాలు జరిగితే సంబంధిత సెక్షన్‌ అధికారి బాధ్యత వహించాల్సిందే. ప్రతీ రోజు రాత్రి 12 గంటల నుంచి మరునాడు రాత్రి 12 గంటల్లోపు నాలుగుసార్లు పైగా.. విద్యుత్‌ అంతరాయం జరిగినా, 30 నిమిషాలకు మించి విద్యుత్‌ సరఫరాలో కోత విధించడాన్ని యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంటోంది. నాలుగు పర్యాయాల్లో 30 నిమిషాలకు మించి విద్యుత్‌ సరఫరా నిలిపివేయకూడదు. అలాగని, ఒకేసారి 30 నిమిషాలకుపైగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగితే సంబంధిత సెక్షన్‌ అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

ప్రతీ ఒక్కటి నిక్షిప్తం..

ప్రతీ సబ్‌ స్టేషన్‌కు స్కాడా సాంకేతికతను ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం వినియోగిస్తోంది. 33 కేవీ, 11 కేవీ విద్యుత్‌ లైన్లలో విద్యుత్‌ అంతరాయం కలిగితే టీజీ ఎన్పీడీసీఎల్‌లో ఏర్పాటు చేసిన డాష్‌ బోర్డులో నమోదవుతుంది. దీంతో రోజుకు ఎన్ని పర్యాయాలు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది అనేది ఆన్‌లైన్‌లో తెలిసిపోతుంది. దీని ఆధారంగా ప్రతీ రోజు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆపరేషన్‌ చీఫ్‌ ఇంజనీర్లు సమీక్షిస్తారు. టీజీ ఎన్పీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కర్నాటి వరుణ్‌రెడ్డి, ఆపరేషన్‌ డైరక్టర్‌ టి.మధుసూదన్‌ సమక్షంలో డివిజనల్‌ ఇంజనీర్లతో ఆపరేషన్‌ చీఫ్‌ ఇంజనీర్లు సమీక్షించి కారణాలు తెలుసుకుంటారు. ప్రతీ రోజు ఉదయం 9.45 నుంచి 10.30 వరకు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల్లోపు ప్రతీ రోజు ఏ సబ్‌ స్టేషన్‌ పరిధిలో ఏఏ ఫీడర్లలో ఎన్ని పర్యాయాలు అంతరాయం కలిగిందనే వివరాలను కార్పొరేట్‌ కార్యాలయం నుంచి డివిజనల్‌ ఇంజనీర్లకు చేరుతుంది. డివిజనల్‌ ఇంజనీర్‌లో సంబందిత సెక్షన్‌ ఆఫీసర్లు అయిన ఏఈల నుంచి సమాచారం సేకరిస్తారు. అనంతరం జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో కారణాలను సీఎండీ, ఆపరేషన్‌ డైరక్టర్‌, ఆపరేషన్‌ చీఫ్‌ ఇంజనీర్లకు వివరిస్తారు. తద్వారా అంతరాయాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటారు.

వేసవిలో విద్యుత్‌ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్‌ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ప్రత్యేకంగా వేసవి కార్యాచరణను రూపొందించుకుని ముందుకుసాగుతోంది. టీజీ ఎన్పీడీసీఎల్‌ పరిధిలో మొత్తం 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు 1,524 ఉన్నాయి. 33 కేవీ ఫీడర్లు 691, 11 కేవీ ఫీడర్లు 6,636 ఉన్నాయి. వ్యవసాయానికి సంబంధించిన 11 కేవీ ఫీడర్లు 590 ఉన్నాయి. సబ్‌ స్టేషన్లను రియల్‌ టైం ఫీడర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ ద్వారా కార్పొరేట్‌ కార్యాలయానికి అనుసంధానం చేయడం ద్వారా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడిన వెంటనే కచ్చితమైన సమాచారం కార్పొరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డ్యాష్‌ బోర్డులో నమోదవుతుంది. తద్వారా ప్రతీ రోజు ఎన్ని సార్లు విద్యుత్‌ అంతరాయాలు జరిగాయో తెలుస్తోంది.

కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: ప్రజా రవాణాను బలోపేతం చేసేందుకు గ్రేటర్‌ వరంగల్‌ నగరానికి ప్రభుత్వం 100 ఎలక్ట్రిక్‌ బస్సులు మంజూరు చేసిందని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు. బస్సుల నిర్వహణ కోసం ప్రతిపాదిత స్థలాన్ని త్వరగా అప్పగించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆర్టీసీ, రెవెన్యూ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఎలక్ట్రిక్‌ బస్సుల నిర్వహణ కోసం మడికొండలో ప్రతిపాదించిన స్థలం, నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్‌ చర్చించారు. హనుమకొండ చౌరస్తా బస్‌ బే అభివృద్ధి అంశంపై ఆర్టీసీ, ‘కుడా’ అధికారులతో చర్చించారు. కాజీపేటలో బస్టాండ్‌ నిర్మాణంపై సమీక్షించారు. డిప్యూటీ ఆర్‌ఎం భాను కిరణ్‌, మధు, ఆ ర్డీఓ రాథోడ్‌ రమేశ్‌, ఆర్టీసీ డీఎం ధరమ్‌సింగ్‌, తహసీల్దార్‌ రాజు, అధికారులున్నారు.

చట్టం సమర్థంగా అమలు కావాలి

జిల్లాలో ఆహార భద్రత చట్టం సమర్థంగా అమలు కావాలని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు, రేషన్‌ దుకాణాలకు బియ్యం సరఫరా, సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, మోడల్‌ స్కూల్స్‌, కేజీబీవీలకు బియ్యం పంపిణీ అంశాలపై అధికారులతో సమీక్షించారు. రేషన్‌ డీలర్ల నియామకానికి చర్యలు చేపడతామన్నారు. జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో సిబ్బంది వివరాలు, పీడీఎస్‌ రైస్‌ పంపిణీలో అక్రమాలపై నమోదైన కేసుల స్థితిగతులను జిల్లా పౌర సరఫరాల అధికారి వాజీద్‌ వివరించారు. అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి, జెడ్పీ సీఈఓ శేషాద్రి, జిల్లా సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ మేనేజర్‌ మహేందర్‌, డీఆర్డీఓ మేన శ్రీను, డీఈఓ గిరిరాజు గౌడ్‌, ఎన్జీఓ ప్రతినిధి అనితా రెడ్డి, జిల్లా తూనికలు కొలతల శాఖ అధికారి వెంకటేశ్వర్లు ఉన్నారు.

కార్యాచరణతో..

వేసవిలో విద్యుత్‌ కోతలు లేని

సరఫరానే లక్ష్యం

ప్రతీ రోజు అధికారులతో

వీడియో కాన్ఫరెన్స్‌

నిట్‌లో ఉత్సాహంగా స్ప్రింగ్‌స్ప్రీ–26 వేడుకలు1
1/7

నిట్‌లో ఉత్సాహంగా స్ప్రింగ్‌స్ప్రీ–26 వేడుకలు

నిట్‌లో ఉత్సాహంగా స్ప్రింగ్‌స్ప్రీ–26 వేడుకలు2
2/7

నిట్‌లో ఉత్సాహంగా స్ప్రింగ్‌స్ప్రీ–26 వేడుకలు

నిట్‌లో ఉత్సాహంగా స్ప్రింగ్‌స్ప్రీ–26 వేడుకలు3
3/7

నిట్‌లో ఉత్సాహంగా స్ప్రింగ్‌స్ప్రీ–26 వేడుకలు

నిట్‌లో ఉత్సాహంగా స్ప్రింగ్‌స్ప్రీ–26 వేడుకలు4
4/7

నిట్‌లో ఉత్సాహంగా స్ప్రింగ్‌స్ప్రీ–26 వేడుకలు

నిట్‌లో ఉత్సాహంగా స్ప్రింగ్‌స్ప్రీ–26 వేడుకలు5
5/7

నిట్‌లో ఉత్సాహంగా స్ప్రింగ్‌స్ప్రీ–26 వేడుకలు

నిట్‌లో ఉత్సాహంగా స్ప్రింగ్‌స్ప్రీ–26 వేడుకలు6
6/7

నిట్‌లో ఉత్సాహంగా స్ప్రింగ్‌స్ప్రీ–26 వేడుకలు

నిట్‌లో ఉత్సాహంగా స్ప్రింగ్‌స్ప్రీ–26 వేడుకలు7
7/7

నిట్‌లో ఉత్సాహంగా స్ప్రింగ్‌స్ప్రీ–26 వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement