పారాత్రోబాల్‌ పోటీల్లో కృష్ణవేణికి గోల్డ్‌మెడల్‌ | - | Sakshi
Sakshi News home page

పారాత్రోబాల్‌ పోటీల్లో కృష్ణవేణికి గోల్డ్‌మెడల్‌

Feb 25 2026 7:01 AM | Updated on Feb 25 2026 7:01 AM

పారాత

పారాత్రోబాల్‌ పోటీల్లో కృష్ణవేణికి గోల్డ్‌మెడల్‌

పారాత్రోబాల్‌ పోటీల్లో కృష్ణవేణికి గోల్డ్‌మెడల్‌ 5 నుంచి పీజీ ఫస్ట్‌ సెమిస్టర్‌ పరీక్షలు యుద్ధప్రాతిపదికన వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు టీబీ నియంత్రణకు కృషిచేయాలి : డీఎంహెచ్‌ఓ

కేయూ క్యాంపస్‌: ఇండోనేషియాలోని సురకర్ణా నగరంలో ఉన్న గోర్‌ ఎఫ్‌కోర్‌ యూనివర్సిటీలో ఈనెల 15న నిర్వహించిన ఇండోనేషియా ఇంటర్నేషనల్‌ పారా త్రోబాల్‌ మ్యాచ్‌ సిరీస్‌లో కేయూ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం పరిశోధక విద్యార్థిని మాచర్ల కృష్ణవేణి గోల్డ్‌మెడల్‌ సాధించింది. మంగళవారం కాకతీయ యూనివర్సిటీలో వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ రామచంద్రం కృష్ణవేణిని అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ డిఫెరెంట్లీఏబుల్డ్‌ సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాజు పాల్గొన్నారు.

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాలో వాయిదావేసిన పీజీ ఫస్ట్‌ సెమిస్టర్‌ పరీక్షల టైంటేబుల్‌ను మంగళవారం పరీక్షల విభాగం అధికారులు విడుదల చేశారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్‌ఆర్‌ఎం, లైబ్రరీ సైన్స్‌ తదితర కోర్సుల మొదటి సెమిస్టర్‌ పరీక్షలను మార్చి 5 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి శ్రీనివాస్‌ తెలిపారు. మార్చి 5, 7, 10, 12, 16, 18 తేదీల్లో పరీక్షలను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు.

హన్మకొండ: యుద్ధప్రాతిపదికన వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్‌ హనుమకొండ సర్కిల్‌ ఎస్‌ఈ పి.మధసూదన్‌రావు తెలిపారు. నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్‌ సరఫరా చేయడమే లక్ష్యంగా 2025 డిసెంబర్‌ నుంచి ఇప్పటివరకు మొత్తం 392 వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులు ఇచ్చినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. క్షేత్రస్థాయిలో అవసరమైన విద్యుత్‌ స్తంభాలు, తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు ఇతర అవసరమైన మెటీరియల్‌ అందుబాటులో ఉంచినట్లు వివరించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వ్యవసాయరంగానికి విద్యుత్‌శాఖ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, అధికారుల సమన్వయం, సత్వర చర్యల ఫలితంగా సర్వీసుల మంజూరు ప్రక్రియ వేగవంతమైందని ఎస్‌ఈ తెలిపారు.

ఎంజీఎం: హనుమకొండ జిల్లాలో టీబీ నియంత్రణకు కృషిచేయాలని డీఎంహెచ్‌ఓ అప్పయ్య వైద్యాధికారులు, క్షయ వ్యాధి నివారణ సిబ్బంది సూచించారు. వరంగల్‌ డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీబీ మరణాలు తగ్గించడానికి ఇలాంటి శిక్షణ ఉపయోగకరంమని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి డాక్టర్‌ బ్లెస్సి మాట్లాడుతూ క్షయ నియంత్రణలో భాగంగా హైరిస్క్‌ వ్యాధిగ్రస్తులను త్వరగా గుర్తించి వారి వివరాలను పోర్టల్‌లో నమోదు చేసి అవసరమైన మందులు అందించాలని అన్నారు. జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్‌ హిమబిందు మాట్లాడుతూ క్షయ వ్యాధి నిర్ధారణ కోసం 1,93,935 మందికి పరీక్షలు చేశామని తెలిపారు. 73,711 మందికి ఎక్స్‌రేలు తీశామని, వీరిలో 1,104 మందికి టీబీ గుర్తించినట్లు తెలిపారు.

పారాత్రోబాల్‌ పోటీల్లో  కృష్ణవేణికి గోల్డ్‌మెడల్‌1
1/1

పారాత్రోబాల్‌ పోటీల్లో కృష్ణవేణికి గోల్డ్‌మెడల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement