టెన్త్‌ విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలి | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌ విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలి

Feb 25 2026 7:01 AM | Updated on Feb 25 2026 7:01 AM

టెన్త్‌ విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలి

టెన్త్‌ విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలి

టెన్త్‌ విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలి

జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజ్‌గౌడ్‌

దామెర: పదో తరగతి విధ్యార్థులు ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజ్‌గౌడ్‌ సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంగళవారం డీఈఓ సందర్శించి ప్రత్యేక తరగతులను పరిశీలించారు. ఫ్రీఫైనల్‌ పరీక్షల్లో వచ్చిన మార్కుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలో పదో తరగతి పరీక్షలు కీలకమని అన్నారు. పట్టుదలతో చదివి లక్ష్యం చేరేవిధంగా పరీక్షలకు సన్నద్ధం కావాలని కోరారు. ఆందోళన చెందకుండా శాంతియుత వాతావరణంలో పరీక్షలు రాయాలని పేర్కొన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని, సాయంత్రం వేళ స్నాక్స్‌ పంపిణీ చేయడంతోపాటు ప్రత్యేక టైంటేబుల్‌ ప్రకారం విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. ఆయన వెంట ఎంఈఓ లకావత్‌ రాజేశ్‌కుమార్‌, ఉపాధ్యాయురాలు ఉమామహేశ్వరి, విద్యార్థులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement