ఉత్తమ పాలన అందించాలి | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ పాలన అందించాలి

Feb 25 2026 7:01 AM | Updated on Feb 25 2026 7:01 AM

ఉత్తమ పాలన అందించాలి

ఉత్తమ పాలన అందించాలి

సర్పంచ్‌లకు కలెక్టర్‌ సత్యశారద హితవు

గంగదేవిపల్లిలో మూడో విడత శిక్షణ

గీసుకొండ: గ్రామాల్లో సర్పంచ్‌లు ఉత్తమ పాలన అందించి మంచి గుర్తింపు పొందాలని కలెక్టర్‌ సత్యశారద అన్నారు. మంగళవారం జాతీయ ఆదర్శగ్రామం గంగదేవిపల్లిలో వర్ధన్నపేట, నల్లబెల్లి, నెక్కొండ, పర్వతగిరి మండలాలకు చెందిన 117 మంది సర్పంచ్‌లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. ముందస్తు ప్రణాళికలు వేసుకుని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని, ప్రజలు మరచిపోలేని రీతిలో జనరంజక పాలన సాగించాలన్నారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కటకం కల్పన, డీఎల్పీఓ కుంట రాజీవ్‌కుమార్‌, ఎంపీడీఓ అరుంధతి, తహసీల్దార్‌ ఎండీ రియాజుద్దీన్‌, ఎంపీఓలు పాక శ్రీనివాస్‌, కూచన ప్రకాశ్‌, అంబటి సునీల్‌కుమార్‌రాజు, జిల్లా ట్రైనింగ్‌ మేనేజర్‌ కూసం రాజమౌళి, ఆర్‌ఐ సాంబయ్య, పంచాయతీ కార్యదర్శి రమ్య కుమారి, జీపీఓ రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. శిక్షణ కార్యక్రమానికి వర్ధన్నపేట మండలం కట్య్రాల సర్పంచ్‌ రాయపురం రమ్య తన 25 రోజుల చిన్నారి పాపతో హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement