విద్యార్థులు కష్టపడి చదవాలి
ఖిలా వరంగల్: లక్ష్యాన్ని ఎంచుకొని కష్టపడి చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలని పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ఖిలా వరంగల్ మధ్యకోటలోని ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సోమవారం సాయంత్రం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా బోధన తీరు, ప్రత్యేక తరగతులు, అందిస్తున్న స్నాక్స్‌ను పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలపై అవగాహన కల్పించారు. ప్రణాళికాబద్ధంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రంగయ్య నాయుడు, ఎంఈఓ ప్రసాద్, తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.


