హక్కులపై అవగాహన కలిగి ఉండాలి | - | Sakshi
Sakshi News home page

హక్కులపై అవగాహన కలిగి ఉండాలి

Mar 1 2026 7:23 AM | Updated on Mar 1 2026 7:23 AM

హక్కులపై అవగాహన కలిగి ఉండాలి

హక్కులపై అవగాహన కలిగి ఉండాలి

వర్ధన్నపేట: ప్రతి విద్యార్థి హక్కులు, కర్తవ్యంపై అవగాహన కలిగి ఉండి, బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎదగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ సూచించారు. జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం వర్ధన్నపేట మైనారిటీ బాలుర గురుకులంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్‌, ఆమె ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను ఆసక్తిగా తిలకించి అభినందించారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ మాట్లాడుతూ సైన్స్‌పై ఆసక్తి పెంపొందించుకుని సృజనాత్మకత, ఆలోచనతో ముందుకుసాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలు సేవించడం హానికరమని, చట్టరీత్యా నేరమని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. అనంతరం భారత రాజ్యాంగం ప్రాముఖ్యత, ప్రాథమిక హక్కులను వివరించారు. పాఠశాల ప్రిన్సిపాల్‌ పస్కుల రాజు మాట్లాడుతూ విద్యార్థుల సమష్టికృషితో సైన్స్‌ ఫెయిర్‌ విజయవంతమైందని తెలిపారు. కార్యక్రమంలో వరంగల్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సుధీర్‌కుమార్‌, ఎంపీడీఓ రమణ, సైక్రియాట్రిస్ట్‌ భరత్‌, సీఐ శ్రీనివాసరావు, చీఫ్‌లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిలర్‌ సురేశ్‌ పాల్గొన్నారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement