దివ్యాంగులను అధ్యాపకులుగా నియమించాలి | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగులను అధ్యాపకులుగా నియమించాలి

Feb 26 2026 7:20 AM | Updated on Feb 26 2026 7:20 AM

దివ్య

దివ్యాంగులను అధ్యాపకులుగా నియమించాలి

రాయపర్తి: కాకతీయ యూనివర్సిటీలో పార్ట్‌టైం అధ్యాపకుల నియామకాల్లో దివ్యాంగులకు రోస్టర్‌ పాయింట్ల విధానం అమలు చేయాలని వీసీ ప్రతాప్‌రెడ్డిని కోరినట్లు డిసబుల్‌ స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ అధ్యక్షుడు మహమ్మద్‌ యాకూబ్‌పాషా తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దివ్యాంగులకు అధ్యాపకులుగా అవకాశం కల్పింఆచలని వీసీతోపాటు రిజిస్ట్రార్‌ రామచంద్రంకు వినతిపత్రం అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రాంబాబు, శ్రీశైలం, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

క్రాస్‌కంట్రీ టోర్నమెంట్‌కు కేయూ ఉమెన్‌ జట్టు

కేయూ క్యాంపస్‌: మంగళూరు యూనివర్సిటీలో ఈనెల 27న నిర్వహించనున్న ఆల్‌ఇండియా ఇంటర్‌ యూనివర్సిటీ క్రాస్‌కంట్రీ టోర్నమెంట్‌కు కాకతీయ యూనివర్సిటీ ఉమెన్‌ జట్టును ఎంపికచేసినట్లు స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య బుధవారం తెలిపారు. పి.ఉషారాణి, ఎం.టాబు, పి.హర్షిత, ఎం.రోషిణి, ఎం.అరుణ, జె.భీంబాయి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. యూనివర్సిటీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ బుచ్చయ్య జట్టుకు కోచ్‌ కమ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య తెలిపారు.

బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చర్యలు

వరంగల్‌ క్రైం: బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ హెచ్చరించారు. బాల్య వివాహాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మహిళాశిశు సంక్షేమ శాఖ, జస్ట్‌ రైట్స్‌ ఫర్‌ చిల్డన్ర్స్‌ షేర్‌ స్వచ్ఛంద సంస్థ, యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ వరంగల్‌ విభాగం రూపొందించిన ప్రచార రథాన్ని కమిషనరేట్‌ కార్యాలయంలో బుధవారం సీపీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాల్యవివాహాలు పిల్లల చదువు, ఆరోగ్యం, శారీరక, మానసిక అభివృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు. పిల్లలు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని కోరారు. అదనపు డీసీపీ రవి, ఏహెచ్‌టీయూ ఇన్‌స్పెక్టర్‌ శ్యాంసుందర్‌, ఎస్సై సుధాకర్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ సమీయుద్దీన్‌, షేర్‌ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్‌ శిరీష, జ్ఞానేశ్వరి, జమున, ప్రశాంతి, కల్పన, గాయత్రి, చామంతి, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో కాపరి మృతి

నెక్కొండ: ఓ రైతు తన పొ లం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగ ఎర్త్‌ తగిలి మేకల కాపరి మృతి చెందిన సంఘటన మండలంలోని పెద్దకొర్పోలు గ్రామంలో బుధవారం జరిగింది. ఎస్సై మహేందర్‌, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెద్దకోర్పోలుకు చెందిన చెందిన మట్టె ఏలియా (50) రోజూ మాది రిగానే మేకలను మేతకు తీసుకెళ్లాడు. గ్రామ శివారులోని లోట్లవాగు సమీపంలో గోదాం వద్ద కోతులు బెడద ఉంది. దీంతో ఓ రైతుల తన పొలం చుట్టూ విద్యుత్‌ తీగను ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో మేకలు పొలం వద్దకు వెళ్లగా ఏలియా వాటిన అడ్డుకునే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగ ఎర్త్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ఏలియాకు కూతురు, భార్య ఉంది. భార్య సుభద్ర ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోర్టుమార్టం నిమిత్తం నర్సంపేట మార్చురీకి తరలించినట్లు ఎస్సై మహేందర్‌ తెలిపారు.

దివ్యాంగులను అధ్యాపకులుగా నియమించాలి 
1
1/1

దివ్యాంగులను అధ్యాపకులుగా నియమించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement