ఇంటర్ పరీక్షలు షురూ..
● ప్రథమ సంవత్సరం పరీక్షకు 262 మంది విద్యార్థులు గైర్హాజరు
● నేడు రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభం
విద్యార్థులకు తనిఖీ చేసి లోనికి అనుమతిస్తున్న సిబ్బంది
హంటర్ రోడ్డులోని షైన్ జూనియర్ కాలేజీలో పరీక్ష రాసేందుకు వెళ్తున్న విద్యార్థులు
కాళోజీ సెంటర్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రశాంతంగా ప్రారంభమైనట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. తొలిరోజు ప్రథమ సంవత్సరం పరీక్షకు జనరల్ కోర్సులో మొత్తం విద్యార్థులు 5,680 మందికి గాను 5,491 మంది హాజరు కాగా 189 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఒకేషనల్ కోర్సులో మొత్తం 767 మంది విద్యార్థులకు గాను 694 మంది హాజరు కాగా 73 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 26 పరీక్ష కేంద్రాలకు ఇద్దరు జిల్లాస్థాయి డీఈసీ సభ్యులు, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, నలుగురు సిట్టింగ్ స్క్వాడ్ సిబ్బంది విస్తృతంగా పర్యవేక్షించినట్లు తెలి పారు. డీఈసీ సభ్యులు కె.మాధవరావు, విజయనిర్మల పూర్తిస్థాయిలో పర్యవేక్షించారని డీఐఈఓ తెలిపారు. కాగా నేటి(గురువారం) నుంచి ఇంటర్మీ డియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
ఇంటర్ పరీక్షలు షురూ..
ఇంటర్ పరీక్షలు షురూ..


