నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

Feb 25 2026 7:01 AM | Updated on Feb 25 2026 7:01 AM

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

డీఐఈఓ డాక్టర్‌ శ్రీధర్‌ సుమన్‌

కాళోజీ సెంటర్‌: ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు నేటి (బుధవారం) నుంచి ప్రారంభంకానున్నాయని డీఐఈఓ డాక్టర్‌ శ్రీధర్‌ సుమన్‌ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 26 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఆయా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. విద్యార్థులు ఏమైన సందేశాలు ఉంటే 9240205555 నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చన్నారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, జిరాక్స్‌ సెంటర్స్‌ మూసివేయాలన్నారు. ఫస్టియర్‌ జనరల్‌ కోర్సులో 5,210 మంది, ఒకేషనల్‌ కోర్సులో 793 మంది, సెకండియర్‌ జనరల్‌ కోర్సులో 5,356 మంది, ఒకేషనల్‌ కోర్సులో 807 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు డీఐఈఓ తెలిపారు.

పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు: సీపీ

వరంగల్‌ క్రైం: ఇంటర్మీడియట్‌ పరీక్ష కేంద్రాల వ ద్ద బీఎన్‌ఎస్‌ఎస్‌ 163 (144 )సెక్షన్‌ అమలులో ఉంటుందని వరంగల్‌ సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ తెలి పారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని మొత్తం 94 పరీక్ష కేంద్రాల్లో (హనుమకొండ 52, వరంగల్‌ 24, జనగామ 16) ఈనెల 24 నుంచి మార్చి 18 వరకు ఇంటర్‌ పరీక్షలు జరుగుతాయ ని పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని సీపీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement