స్కావెంజరే ఇక్కడ టీచర్‌ | - | Sakshi
Sakshi News home page

స్కావెంజరే ఇక్కడ టీచర్‌

Feb 24 2026 9:10 AM | Updated on Feb 24 2026 9:10 AM

స్కావెంజరే ఇక్కడ టీచర్‌

స్కావెంజరే ఇక్కడ టీచర్‌

స్కావెంజరే ఇక్కడ టీచర్‌

శాయంపేట: స్కావెంజర్‌ పాఠాలు బోధిస్తున్న పరిస్థితి. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి ప్రాథమిక పాఠశాలలో 10మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయురాలు, ఒక సీఆర్‌పీ ఉన్నారు. సోమవారం సదరు ఉపాధ్యాయురాలు సెలవు పెట్టడం.. సీఆర్‌పీ అందుబాటులో లేకపోవడంతో స్కావెంజర్‌ టీచర్‌గా మారి పిల్లలకు బోధించింది. ఈ విషయమై కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయుడు సారయ్యను వివరణ కోరగా ఉపాధ్యాయురాలు ముందస్తుగా సెలవు తీసుకున్నారని, సీఆర్‌పీ భోజనానికి వెళ్లి ఉండవచ్చని తెలిపారు. కాగా, పాఠశాలకు అదనంగా మరో ఉపాధ్యాయుడిని నియమించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement