పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
రాయపర్తి: పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో వివిధ గ్రామాలకు చెందిన 61 మంది లబ్ధిదారులకు రూ.38,50,000 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, ఎంపీడీఓ కార్యాలయంలో 66 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమాల్లో ఏఎంసీ వైస్‌చైర్మన్ కృష్ణారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్‌నాయక్, సర్పంచ్ గారె సహేంద్ర, సర్పంచ్‌లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


