5 వరకు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల స్వీకరణ
వరంగల్ అర్బన్/హన్మకొండ చౌరస్తా: ఖాళీ స్థలాలు కలిగి ఉండి, అర్హులైనవారు ఇందిరమ్మ ఇళ్ల కోసం మార్చి 5 వరకు దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ కోరారు. బల్దియా ప్రధాన కార్యాలయంలోని కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దరఖాస్తులను హనుమకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేరుగా అందజేయాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదు చేస్తే బహుమానం ఇస్తామని తెలిపారు. ఫ్లోర్‌లీడర్ ఆఫీస్‌లో ఫ్లోర్‌లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు రోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. అభివృద్ధి పనులపై ఫోకస్ చేయాలని ఎమ్మెల్యే నాయిని కోరారు. కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో నిర్వహించిన కార్పొరేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఫ్లోర్‌లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు జక్కుల రవీందర్‌యాదవ్, విజయశ్రీ రజాలీ, మామిండ్ల రాజు యాదవ్, దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, చీకటి ఆనంద్, మానస రాంప్రసాద్, మాజీ కార్పొరేటర్ విద్యాసాగర్ పాల్గొన్నారు.
డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు.. ఫిర్యాదు చేస్తే బహుమానం
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి


