అటు పాలన.. ఇటు బోధన
● ఉచితంగా ట్యూషన్ చెబుతున్న సర్పంచ్ అర్పిత
గీసుకొండ: మండలంలోని జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీ మరియపురం సర్పంచ్‌గా ఇటీవల ఎన్నికైన తిరుమల్‌రెడ్డి అర్పిత.. ఉపాధ్యాయురాలిగా అవతారం ఎత్తారు. సుమారు 40 మంది విద్యార్థులకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉచితంగా ట్యూషన్ చెబుతున్నారు. విద్యార్ధులతో హోంవర్క్ చేయించడం, వారి సందేహాలను నివృత్తి చేయడం, పాఠాలు చదివించడం, రాయించడం చేయిస్తున్నారు. బీకాం, బీఈడీ చదివిన అర్పితకు.. టీచర్‌గా ఆరేళ్ల పాటు బోధనలో అనుభవం ఉంది. విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తుండడం చాలా సంతోషంగా ఉందని ఆమె చెబుతున్నారు.


