టెన్త్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

Feb 26 2026 9:34 AM | Updated on Feb 26 2026 9:34 AM

టెన్త్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

టెన్త్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

టెన్త్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

హనుమకొండ కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

హన్మకొండ అర్బన్‌: టెన్త్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని హనుమకొండ కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. పరీక్ష కేంద్రాలను చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారులు తప్పనిసరిగా సందర్శించాలని ఆదేశించారు. డీఈఓ గిరిరాజ్‌గౌడ్‌, ఏసీజీఈ భువనేశ్వరి, హెడ్‌ మాస్టర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, జిల్లా విద్యాశాఖ ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌ మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి..

కాజీపేట అర్బన్‌: పదో తరగతిలో వందశాతం ఫలితాలు సాధించాలని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ సూచించారు. కాజీపేట మండలం రాంపూర్‌లోని జెడ్పీ ఉన్నత పాఠశాలను కలెక్టర్‌ సందర్శించారు. పదో తరగతి, ఏడో తరగతి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పదో తరగతి విద్యార్థులు ఒత్తిడి జయించి, విజయం సాధించాలని కోరారు. డీఈఓ గిరిరాజ్‌గౌడ్‌, తహసీల్దార్‌ రాజు, ఎంఈఓ మనోజ్‌కుమార్‌, హెచ్‌ఎం వేణుఆనంద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement