‘ఈ–నామ్’తో ఇబ్బందులు
వరంగల్: డిజిటల్ మార్కెటింగ్‌లో భాగంగా కేంద్రం ప్రవేశపెట్టిన ఈ– నామ్‌లో 1.0 సాఫ్ట్‌వేర్‌ను అమలు చేస్తోంది. వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో ఈ–నామ్‌లో పసుపుతోపాటు అపరాలను కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల కొత్త సాఫ్ట్‌వేర్ 2.0ను కేంద్ర ప్రభుత్వం తీసుకురాగా అమలు చేయాలని మార్కెటింగ్ అధికారులు రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లకు ఆదేశాలు ఇచ్చారు. బుధవారం వరంగల్ మార్కెట్‌లో 2.0 వెర్షన్‌లో సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తాయి. దీంతో మార్కెట్‌లో మధ్యాహ్నం 12గంటల వరకు ఈ–నామ్ పోర్టల్‌లో క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. సమస్యను రాష్ట్ర అధికారులకు వివరించగా వారం రోజులపాటు పాతవెర్షన్ (పద్ధతి)లో కొనుగోళ్లు నిర్వహించాలని సూచించినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్.మల్లేశం తెలిపారు. ఈ–నామ్ పేరుతో గంటల తరబడి పంట ఉత్పత్తుల కొనుగోళ్లు నిలిపివేయడంతో పసుపు, అపరాల యార్డుల్లోని రైతులు ఆందోళన చెందారు.
కొత్త సాఫ్ట్‌వేర్‌తో తిప్పలు
పాత పద్ధతిలోనే కొనుగోళ్లు


