నేడు కలెక్టరేట్‌లో ప్రజావాణి | - | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌లో ప్రజావాణి

Feb 23 2026 8:51 AM | Updated on Feb 23 2026 8:51 AM

నేడు

నేడు కలెక్టరేట్‌లో ప్రజావాణి

న్యూశాయంపేట: జిల్లా కలెక్టరేట్‌లో నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ సమస్యల పరిష్కారానికి వినతులు అందించాలని తెలిపారు.

నేడు గ్రేటర్‌ గ్రీవెన్స్‌

వరంగల్‌ మహానగర పాలకసంస్థ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌సెల్‌ నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరించి, అక్కడి అక్కడే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌సెల్‌ను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్‌ సూచించారు.

మేడారంలో భక్తుల రద్దీ

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో గద్దెల ప్రాంగణం భక్తుల రద్దీతో కోలాహలంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకుని సమ్మక్క–సారలమ్మకు పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఒడిబియ్యం, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ప్రధాన ఆర్చీ ద్వారం నుంచి భక్తులను పోలీసులు క్రమపద్ధతిలో దర్శనాలకు పంపించారు. నార్లాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై కమలాకర్‌ భక్తుల రద్దీని పర్యవేక్షించి ప్రశాంతంగా దర్శించుకునేలా చర్యలు తీసుకున్నారు. మేడారం కార్యనిర్వహణాధికారి వీరస్వామి కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎత్తు బంగారం అమ్మవార్లకు మొక్కుగా సమర్పించారు. సంప్రదాయంగా పూజారులు ఆయనకు డోలివాయిద్యాలతో గద్దెలపైకి స్వాగతం పలికారు. ఆయన వెంట సూపరింటెండెంట్‌ విజయ్‌కుమార్‌, జూనియర్‌ అసిస్టెంట్లు జగదీశ్వర్‌, మధు, సిబ్బంది ఉన్నారు.

భద్రకాళికి సంగీత

దర్శకుడు తమన్‌ పూజలు

హన్మకొండ కల్చరల్‌: శ్రీభద్రకాళి దేవాలయాన్ని ఆదివారం సంగీత దర్శకుడు ఎస్‌ఎస్‌ ఽతమన్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ, వరంగల్‌ జోన్‌ డీసీ రామల సునీత, ప్రధానార్చకుడు శేషు ఆయనను ఘనంగా స్వాగతించారు. తమన్‌ అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ధర్మకర్తలు తోనుపునూరి వీరన్న, ఓరుగంటి పూర్ణచందర్‌, మోత్కురి మయూరి, అనంతుల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే, జబర్దస్త్‌ ఫేం రాకేష్‌ కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో దేవాలయంలో భక్తులు పోటెత్తారు.

నేడు కలెక్టరేట్‌లో ప్రజావాణి1
1/1

నేడు కలెక్టరేట్‌లో ప్రజావాణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement