సురక్షిత ప్రయాణానికి హెల్మెట్‌ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

సురక్షిత ప్రయాణానికి హెల్మెట్‌ తప్పనిసరి

Feb 25 2026 7:01 AM | Updated on Feb 25 2026 7:01 AM

సురక్షిత ప్రయాణానికి హెల్మెట్‌ తప్పనిసరి

సురక్షిత ప్రయాణానికి హెల్మెట్‌ తప్పనిసరి

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నెక్కొండ: సురక్షిత ప్రయాణానికి తప్పనిసరిగా హె ల్మెట్‌ ధరించాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మా ధవరెడ్డి అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని ప్రధాన కూడళ్ల వద్ద రోడ్డు భద్రతపై నిర్వహించిన ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలన్నారు. ఎస్సై మహేందర్‌ మాట్లాడుతూ వరంగల్‌ సీపీ ఆదేశాల మేరకు వాహనదారులకు పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్లు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డి, మా ర్కెట్‌ చైర్మన్‌ రావుల హరీశ్‌రెడ్డి, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు లావుడ్యా తిరుమల్‌చౌహాన్‌, మాదాటి శ్రీనివాస్‌, కోశాధికారి కేవీ. సుబ్బారెడ్డి, ఉప సర్పంచ్‌ సింగం శ్రావణిప్రశాంత్‌, రామాలయ కమిటీ చైర్మన్‌ కొమ్మారెడ్డి సుధాకర్‌రెడ్డి, పోలీసులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయ ఆవరణలో మండలంలోని మూడు తండా సర్పంచ్‌ బోడ బాలునాయక్‌, ఉప సర్పంచ్‌ కేలోతు మమత నరేశ్‌, వార్డు సభ్యులతోపాటు పలువురు బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే దొంతి సమక్షంలో కాంగ్రెస్‌ చేరారు. పార్టీలో చేరిన వారిని కండువా కప్పి స్వాగతించారు. మూడు తండా జీపీ అభివృద్ధికి పాటుపడతానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement