ఆరెపల్లిలో బాలల గ్రామసభ
గీసుకొండ: మండలంలోని ఆరెపల్లి గ్రామంలో ఆది వారం నిర్వహించిన బాలల గ్రామసభలో ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. గ్రామం రాష్ట్రస్థాయిలో బాలల స్నేహపూర్వక పంచాయతీగా ఎంపికై కేంద్రానికి నామినెట్ అయిన సందర్భంగా బాలసభ నిర్వహించారు. ఇందులో గ్రామంలో బడికి వెళ్తున్న బాలలు, అంగన్‌వాడీలోని పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న బాలలు పాల్గొని పాఠశాలలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను అధికా రుల దృష్టికి తీసుకొచ్చారు. అంగన్‌వాడీ కేంద్రానికి రంగులు వేయించాలని కోరారు. బాల్యవివాహా లు, విద్యాహక్కు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన తదితర విషయాల గురించి అధికారులు వివరించారు. అనంతరం బాలల హక్కుల పోస్టర్లను ప్రదర్శించారు. బాలల ఆలోచనలకు వేదికగా నిర్వహించిన బాలల గ్రామసభలో సర్పంచ్ తుమ్మనపెల్లి స్వప్న పాల్గొని బాలల అభిప్రాయాలను గౌరవించి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామన్నా రు. సీడీపీఓ డెబోరా, డీసీపీఓ ఉమ, ఎంపీఓ శ్రీని వాస్, పంచాయతీ కార్యదర్శి నల్లెల్ల స్వప్న, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రేవతి, టీచర్ సంధ్య, ఆశ కార్యకర్త శ్రీదేవి, ఎన్జీఓ కోఆర్డినేటర్ శిరీష, చైల్డ్ కోఆర్డినేటర్ కల్పన, శ్రీనివాస్ పాల్గొన్నారు.


