బాల్యవివాహాలు నేరం
● న్యాయమూర్తి నిర్మలా గీతాంబ
వరంగల్ లీగల్: బాల్య వివాహాలను అంతం చేసేందుకు చేసేందుకు ప్రతీ ఒక్కరు పనిచేయాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ పిలుపునిచ్చారు. ‘షేర్’స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘బాల్య వివాహ విముక్తి ప్రచార రథాన్ని’ ప్రధాన న్యాయమూర్తి గురువారం వరంగల్ జిల్లా కోర్ట్ హాల్ ఎదుట జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వరంగల్ జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ కార్యదర్శి సాయికుమార్, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో కలిసి అవగాహన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ మాట్లాడుతూ.. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడంలో ‘షేర్’ ఎన్జీఓ చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం ప్రచా ర రథంపై ఏర్పాటు చేసిన సంతకాల సేకరణలో భాగంగా సంతకం చేశారు.


