సేంద్రియ వ్యవసాయం మేలు
● జిల్లా వ్యవసాయాధికారి అనురాధ
నర్సంపేట రూరల్: రైతులు రసాయన మందులు వాడడం తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు మొ గ్గు చూపాలని జిల్లా వ్యవసాయాధికారి అనురాధ అన్నారు. నర్సంపేట మండలంలోని గురిజాల గ్రామ రైతువేదికలో సర్పంచ్ చందర్‌రావు అధ్యక్షతన రైతులకు కేన్సర్‌పై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ రోజురోజుకూ రసాయన ఎరువుల వాడకం పెరిగిపోతుందని, దీంతో భూమిలోని సారవంతం దెబ్బతింటుందన్నారు. రైతులు సేంద్రియ వ్యవసాయంపై మక్కువ చూపాలన్నారు. గురిజాల గ్రామంలో కేన్సర్ బారిన పడి గత సంవత్సరం కాలంలో 19 మంది మృతి చెందారన్నారన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నారావుపేట వైద్యాధికారి సరోజన, ఏటీఎంఏ ప్రాజెక్టు డైరెక్టర్ విజయనిర్మల, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చ ర్ దామోదర్‌రెడ్డి, మండల వ్యవసాయాధికారి కృష్ణకుమార్, ఏఈఓలు అశోక్, సంధ్య, గుంటూరుపల్లి సర్పంచ్ బానోత్ కవిత, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
యాప్ ద్వారానే యూరియా అందించాలి
ఖానాపురం: యాప్ ద్వారానే రైతులకు యూరియా అందించాలని డీఏఓ అనురాధ సూచించారు. ఈ మేరకు మండలంలోని మనుబోతులగడ్డ, కొత్తూరు గ్రామాల్లోని ఎరువుల షాపులను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి సూచనలు చేశారు. రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏఓ భోగ శ్రీనివాస్, ఏఈఓ ఉన్నారు.


